తిరుపతిలో భారీ వర్షాలు.. పూర్తిగా నిండిపోయిన జలశయాలు

By Rekulapally SaichandFirst Published Oct 20, 2019, 6:09 PM IST
Highlights

గత మూడు నెలలుగా కురుప్తున్న భారీ వర్షాలకు తిరుపతిలోని జలశయాలు పూర్తిగా నిండిపోయాయి.  జలశయాల్లో నీటిమట్టం పెరిగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుప‌తిలోని క‌ల్యాణి డ్యామ్‌ పూర్తిగా నిండిపోయింది. తిరుమ‌ల‌లోని జ‌లాశ‌యాల్లో నిండడంతో  రానున్న 295 రోజుల‌కు స‌రిప‌డా నీటి నిల్వ‌లున్నాయి. ఇటీవల విస్తారంగా వర్షాలు కురిశాయి. తిరుమలలోని జలాశయాల్లో మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 5,047 మిలియన్‌ లీటర్లు కాగా, ప్రస్తుతం 2,164 మిలియన్‌ లీటర్ల నీరు నిల్వ ఉంది.

ప్రస్తుతం తిరుమలలో భక్తులకు సరాసరిన రోజుకు 14 మిలియన్‌ లీటర్ల నీరు అవసరమవుతోంది. తిరుమలలో గోగర్భం, పాపవినాశనం, ఆకాశగంగ, కుమారధార మరియు పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. తిరుపతిలోని కల్యాణి డ్యామ్‌లో 700 ఎంసిఎఫ్‌టి(మిలియ‌న్ క్యూబిక్ ఫీట్‌) నీరు నిల్వ ఉంది.గోగర్భం డ్యామ్‌ పూర్తి నిల్వ సామర్థ్యం 2,683 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం 539 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉంది. 

అలాగే పాపవినాశనం డ్యామ్‌ పూర్తి నిల్వ సామర్థ్యం 5,215 లక్షల గ్యాలన్లు కాగా ప్రస్తుతం 1,128 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉంది. ఆకాశగంగ డ్యామ్‌ పూర్తి నిల్వ సామర్థ్యం 670 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం 390 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉంది. కుమారధార మరియు పసుపుధార డ్యామ్‌ పూర్తి నిల్వ సామర్థ్యం 5,312 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం 3,892 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉంది.

రెండో అంతస్తు నుంచి జారీ.. రోడ్డుపై రిక్షాలో పడ్డ చిన్నారి

click me!