జనవరిలో భారీగా నోటిఫికేషన్లు: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

By Rekulapally SaichandFirst Published Oct 20, 2019, 4:25 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంగా  ఏర్పడటం అభినందనీయమని తిరుపతి పార్లమెంట్ సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ అన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా మొదటి కౌన్సిల్ సమావేశానికి తిరుపతి పార్లమెంట్ సభ్యులు, తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి, ప్రభుత్వ విప్ మతీయు తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి, తిరుపతి ఆర్డీఓ కనక నరసా రెడ్డి  హాజరయ్యారు.

 రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు అందరూ నూతన ఒరవడితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంగా  ఏర్పడటం అభినందనీయమని తిరుపతి పార్లమెంట్ సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ అన్నారు. ఆదివారం స్థానిక ఎస్.వి.యూనివర్సిటీ శ్రీనివాసా  ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా మొదటి కౌన్సిల్ సమావేశానికి తిరుపతి పార్లమెంట్ సభ్యులు, తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి, ప్రభుత్వ విప్ మతీయు తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి, తిరుపతి ఆర్డీఓ కనక నరసా రెడ్డి  ముఖ్య అతిధిలుగా హాజరయి జ్యోతి ప్రజ్వలన చేసి  ప్రసంగించారు.
    

తిరుపతి పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ ఒకే సంఘంగా ఏర్పడటం సంతోషమని ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వా ఆశయాలను అమలు చేసే భాద్యత ఉద్యోగులదేనని అన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల భాద్యత , బద్రతకు ప్రదాన్యతనిచ్చే వ్యక్తి అని రాష్ట్రంలో సమ్మెకు తావిచ్చే వ్యక్తి మన ముఖ్యమంత్రి  కాదని అన్నారు.

ఆ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వైఎస్ జగన్ షాక్: రిటైర్డ్ ఉద్యోగులకు కూడా...
 తిరుపతి శాసన సభ్యులు ప్రసంగిస్తూ చిత్తశుద్దితో ఉద్యోగ సంఘాల నాయకులు పనిచేసి మీకు కావలసిన అవసరాలు, రావలసినవి పరిష్కరించుకునే విధంగా ఉండాలని అన్నారు. భజనతో కాదు భాద్యతతో పార్టీలతో కాదు ప్రభుత్వంతో అన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నినాదం బాగుందని అన్నారు.

 పల్లకీలు మోసే భోయులగా వుండరాదని, ఉజ్వల భవిష్యత్ తో సమాజానికి మీసేవలు అందించాలని అన్నారు. ఉద్యోగుల, రైతుల, కామికుల, కర్షకుల పక్షపాతి మన ముఖ్యమంత్రి అని అన్నారు. గతంలో నాయకులు స్వప్రయోజనాలకోసం పదవులు పొండదం వంటివి మనం చూశామని, అలా కాకుండా ప్రజల సంక్షేమానికి, ఉద్యోగుల సంక్షేమానికి పరిమితం అయితే బాగుంటుందని అన్నారు. ప్రభుత్వ విప్ ,తుడా ఛైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వుద్యోగుల పని భారం తగ్గించడానికి మన ముఖ్యమంత్రి 4.50 లక్షల ఉద్యోగ నియామకాలకు శ్రీకారం చుట్టారని, రానున్న జనవరి నుండి ప్రభుత్వ శాఖల్లో వున్న ఖాళీలు పూర్తిస్థాయిలో నియామకం జరపడానికి క్యాలెండర్ రూపకల్పన జరిగిందని అన్నారు. 


డిఎ, పీఆర్సీ మంజూరు వంటివి ముఖ్యమంత్రి దృష్టి పెడుతున్నారని ఉద్యోగ నియమకాలు , బదిలీలు పారదర్శకత, పోలీసులకు వారాంతపు సెలవు వంటివి అమలు   స్వయంగా మీరే చూశారని అన్నారు. గతంలో మనం చూశాం అన్నారు. గతంలో సంఘ నాయకుడు అశోక్ బాబు  నేను శాసన సభ్యులుగా వున్న నియోజకవర్గంలో  ప్రెస్ మీట్ పెట్టి కారణం లేకుండా నన్ను విమర్శించారని అతని పై పరువు నష్టం కేసు వేశానని ఇంకా కోర్టుచుట్టూ తిరుగుతున్నారని అన్నారు. స్వప్రయోజనాల కోసం, పార్టీ పదవులకోసం ఉద్యోగ సంఘాల నాయకులు  పనిచేయరాదని అన్నారు. 

వైసీపీలో పదవుల పందేరం: లిస్ట్ లో ఆ 30 మంది వీరే......


తిరుపతి ఆర్డీఓ మాట్లాడుతూ నూతన సంఘం ఈ పుణ్యక్షేత్రం, పవిత్ర స్థలంలో మొదటి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయం అని అన్నారు. 13 జిల్లాలో సమావేశాలు నిర్వహించి ఉద్యోగుల సంక్షేమానికి వారి అవసరాలను ముఖ్యమంత్రి దృష్టి కి తీసుకెల్లే ప్రయత్నంలో భాగంగా రాష్ట్రముఖ్యమంత్రితో అమరావతిలో  నవంబర్ మాసంలో నిర్వహించనున్న సభ విజవంతం కావాలని ఆశిస్తున్నానని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజలకు అందవలసిన సంక్షేమ పథకాలు చిత్తశుద్దితో లబ్దిదారులకు  అందించే ప్రయత్నం మనం చేయాలని అన్నారు. 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్రఅధ్యక్షులు కె.ఆర్.సూర్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో చిన్న కేడర్ నుండి గెజిటెడ్ వరకు ఒకే సంఘంగా అన్నిశాఖలు సమన్వయంతో ఏర్పాటుకు పెద్ద మనసుతో అంగీకరించి జి.నెం.103 తేది.16.08.2019 విడుదలచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (578/2010 రిజిష్టర్ నెంబర్ ) జీవంపోసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదలని అన్నారు. అనతరం ప్రభుత్వం నుండి ఉద్యోగులకు, పింఛనుదారులకు అందవలసిన బకాయిలు, సిపిఎస్ విధానం సంఘ జిల్లా , రాష్ట్ర నాయకులు  పై చర్చించారు.   ఈ సమావేశంలో సంఘ  రాష్ట్ర కార్యదర్శి ఆస్కార రావు,ఇతర జిల్లాల నాయకులు , చిత్తూరు జిల్లా అద్యక్షులు ప్రసాద్ రెడ్డి, కార్యదర్శి తులసీరామ్, ట్రెజరర్ మధుబాబు , అన్నిశాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

click me!