తిరుమల సమాచారం

By Arun Kumar P  |  First Published Oct 18, 2019, 2:12 PM IST

కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షంగా దర్శించుకునేందుకు తిరుమలకు వెళుతున్నారా....అయితే మీరు తప్పకుండా మేమందించే తిరుమల సమాచారాన్ని ఫాలో కావాల్సిందే. 


కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షంగా దర్శించుకోవాలనే భక్తుల సౌకర్యార్థం ఏషియానెట్ న్యూస్ ప్రత్యేకంగా తిరుమల సమాచారాన్ని అందిస్తోంది. తిరుమలలో వాతావరణ పరిస్థితులు, రద్దీ, సౌకర్యాలు తదితర  విషయాల గురించి తెలుసుకోవాలంటే తాము ప్రతిరోజు అందించే ఈ తిరుమల సమాచారాన్ని పాలోకండి.   

ఈ రోజు శుక్రవారం 18.10.2019   ఉదయం 7 గంటల వరకు గల పరిస్థితుల ఆధారంగా తిరుమలలో పరిస్థితులు ఇలా వున్నాయి. 

Latest Videos

undefined

తిరుమల వాతావరణం 20C°-25℃°గా వుంది. 

నిన్న(గురువారం) 70,661 మంది   భక్తుల కు కలియుగ దైవం  శ్రీ వేంకటేశ్వరస్వామి వారి   దర్శన భాగ్యం కల్గినది

స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం  క్యూకాంప్లెక్స్ లో 17 గదుల్లో భక్తులు వేచి ఉన్నారు   శ్రీవారి  సర్వదర్శనాని కి సుమారు 10 గంటలు పడుతోంది

గురువారం 30,551 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

గురువారం స్వామివారి హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ. 3.05 కోట్లుగా వుంది.

శీఘ్రసర్వదర్శనం(SSD),  ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ రూ:300/-), దివ్యదర్శనం(కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా  రెండు గంటల సమయం పడుతోంది. 

 
ప్రత్యేక గమనిక:

 అక్టోబ‌రు 30 తేదీన చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఉ: 9 నుండి మ:1.30 వ‌ర‌కు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు).  
అక్టోబరు 29న వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక  ఉచిత దర్శనం (భక్తులు రద్దీ సమయాల్లో ఇబ్బంది పడకుండా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోగలర  టిటిడి సూచిస్తోంది.). ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. వీరికి ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు.  

click me!