చిత్తూరు: వాహనాలపైకి దూసుకెళ్లిన కంటైనర్, 12 మంది దుర్మరణం

By sivanagaprasad KodatiFirst Published Nov 8, 2019, 7:11 PM IST
Highlights

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పలమనేరులోని మోగులి ఘాట్ రోడ్డు వద్ద ఓ భారీ కంటైనర్ వాహనాల మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 మంది దుర్మరణం పాలవ్వగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిత్తూరు-బెంగళూరు జాతీయ రహదారిపై బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్ వద్ద వాహనాలపైకి కంటైనర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 12 మంది అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. కంటైనర్ బ్రేకులు ఫెయిల్ కావడంతో అది ఆటో, మినీ వ్యాన్, బైక్‌పై దూసుకెళ్లింది.

దీంతో కంటైనర్ కింద నలిగిపోయి వీరు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఎక్కువమంది మహిళలే.. వీరందరూ గంగవరం మండలం మరి మా కుల పల్లె గ్రామానికి చెందిన వారు. ఒకే కుటుంబంలో ఎనిమిది మంది మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

"

ఈ ఘటనలో ఆటో, టూ వీలర్, వ్యాన్ ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.

మృతుల వివరాలు: రామచంద్ర 50, రాము 38, సావిత్రమ్మ 40, ప్రమీల 37, గురమ్మ 52, సుబ్రమణ్యం 49, శేఖర్ 45, పాపమ్మ 49

కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ నడిబొడ్డు చాదర్‌ఘాట్ వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి ఫుటేజీలో యువతి తల టైర్ కింద నలిగిపోయినట్టు స్పష్టంగా కనిపించింది. వివరాల్లోకి వెళితే.. మలక్‌పేటకు చెందిన కావ్య అనే విద్యార్థిని.. తన స్నేహితుడితో కలిసి ఆర్ఆర్‌బీ పరీక్ష రాసేందుకు బయల్దేరారు.

"

Also read:యువతిని బలి తీసుకున్న హైదరాబాద్ రోడ్లు.. వీడియో వైరల్

చాదర్‌ఘాట్ వద్దకు బానే వచ్చారు. అయితే అతుకులు, గతుకుల రోడ్డు కావడంతో కాస్త మెల్లిగానే వెళుతున్నారు. ఈ క్రమంలో ఓ చోట గతుకు ఉండటంతో టూవీలర్ స్లో చేశాడు. అయితే బండి స్కిడ్డవడంతో ఇద్దరు వాహనంపై నుంచి రోడ్డుపై పడిపోయారు.

లేద్దామనుకునేలోపే అటుగా వస్తోన్న బస్సు యువతి తలపైనుంచి వెళ్లింది. దీంతో కావ్య అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. బస్సు టైర్‌కు కాసింత దూరంలో ఉన్న యువకుడు కూడా తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు అతనిని సమీప ఆస్పత్రికి తరలించారు.

"

కావ్య మృతితో ఆమె కుటుంబంలో విషాదఛాయలు అలుముకొన్నాయి. రోడ్డు సరిగా లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం తమ బిడ్డును బలి తీసుకుందని మండిపడుతున్నారు.

Also Read:Video: హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం... ఆర్టీసి ఉద్యోగి మృతి

తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. కావ్య పేరెంట్స్ వాదన ఇలా ఉంటే.. అక్కడ రహదారి సరిగానే ఉందని మున్సిపల్ అధికారులు సెలవిస్తున్నారు. వారి వాహనం స్కిడ్ కావడం వల్లే వారు ప్రమాదానికి గురయ్యారే తప్ప.. అందులో తమ తప్పేమి లేదని తేల్చిచెప్పారు.

click me!