పృథ్వీ షాక్, చైర్మన్ పదవి ఖాళీ: ఎండీ పోస్టులో ధర్మారెడ్డి

Published : Jan 24, 2020, 06:54 PM ISTUpdated : Jan 24, 2020, 06:55 PM IST
పృథ్వీ షాక్, చైర్మన్ పదవి ఖాళీ: ఎండీ పోస్టులో ధర్మారెడ్డి

సారాంశం

ఎస్వీబీసీ చైర్మన్ పదవికి సినీ నటుడు పృథ్వీ రాజీనాామా చేసిన తర్వాత ఆ పదవిని ఖాళీగానే ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఎండీ పోస్టును సృష్టించి ఆ పదవిలో ధర్మారెడ్డిని నియమించింది.

తిరుపతి: ఎస్వీబీసీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఎస్వీబీసీలో కొత్తగా మేనేజింగ్ డైరెక్టర్ పదవికి సృష్టించింది. ఆ పదవిలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అదనపు ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (ఈవో) ధర్మారెడ్డిని నియమించింది.

ఆ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పృథ్వీ వ్యవహారంతో ఎస్వీబీసీ చైర్మన్ పదవిని ఖాళీగా ఉంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎస్వీబీసీకి మరో ఇద్దరు డైరెక్టర్లను కూడా నియమించింది. 

Also Read: ఎస్‌వీబీసీ ఛైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా

మహిళతో అనుచిత రీతిలో మాట్లాడాడనే ఆరోపణలు రావడంతో సినీ నటుడు పృథ్వీ ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్ కావడంతో ఆయన ఆ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. చానెలో ఉద్యోగినితో పృథ్వీ అసభ్యంగా మాట్లాడారంటూ ఓ ఆడియో రికార్డింగ్ వైరల్ అయింది. 

తనపై వచ్చిన ఆరోపణలను పృథ్వీ ఖండించారు. ఆడియోను మార్ఫింగ్ చేశారని, అది నిజం కాదని ఆయన చెప్పారు. తనపై కుట్ర జరిగిందని కూడా ఆయన ఆరోపించారు పృథ్వీ రాజీనామా చేసిన తర్వాత ఎస్వీబీసీ చైర్మన్ పదవిని ప్రభుత్వం భర్తీ చేయలేదు. దాన్ని ఖాళీగానే ఉంచాలని భావిస్తున్నట్లు సమాచారం.

Also Read: సెక్స్ చాట్, టాక్ నిషిద్ధమా: పృథ్వీకి మహేష్ కత్తి ఫుల్ సపోర్ట్

PREV
click me!

Recommended Stories

వెంకన్న భక్తులకు శుభవార్త.. తిరుపతికి ప్రత్యేక రైలు
లడ్డూ వివాదం తర్వాత తిరుమలలో భారీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్.. వివ‌రాలు ఇవిగో