న్యాయం కోసం... ఎమ్మెల్యే ఇంటి ఎదుట వృద్దురాలి నిరాహారదీక్ష

By Arun Kumar PFirst Published Nov 2, 2019, 4:34 PM IST
Highlights

చిత్తూరు జిల్లాలో ఓ 75యేళ్ల  వృద్ధురాలు ఏకంగా స్థానిక ఎమ్మెల్యే ఇంటిముందే నిరాహార ధీక్షకు దిగడం సంచలనంగా మారింది. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదంటూ ఆమె అక్కడే బైఠాయించారు.  

చిత్తూరు: తనకు అందాల్సిన పించను డబ్బుల కోసం ఓ వృద్దమహిళ ఏకగా స్థానిక ఎమ్మెల్యే ఇంటి ఎదుటే నిరాహార ధీక్షకు దిగింది. గత కొన్ని నెలలుగా తనకు పించను డబ్బులు రావడంలేదని... దీంతో వాటిపైనే ఆధారపడిన జీవిస్తున్న తాను పస్తులుండాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన బాధను అధికారులకు వివరించినా ఫలితం లేదని అందువల్లే ఇలా ఎమ్మెల్యే ఇంటి ఎదుట న్యాయం కోసం నిరాహార దీక్షకు దిగినట్లు వృద్దమహిళ వాపోయింది. 

వివరాల్లోకి వెళితే...చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంవేరు పల్లెకు చెందిన వృద్దురాలు చెంగమ్మ భర్త చనిపోవడంతో  ఒంటరిగా జీవిస్తోంది. వృద్దాప్యం వల్ల ఏ పనులు చేయలేకపోతోంది దీంతో ప్రభుత్వం అందించే పించను డబ్బులే ఆమెకు ఆధారంగా మారాయి. ఈ డబ్బులతోనే ఆమె జీవనం కొనసాగిస్తోంది. 

read more హైదరాబాద్‌లో దారుణం...పురిటిబిడ్డ బ్రతికుండగానే పూడ్చిపెట్టే ప్రయత్నం

అయితే ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాతి నుండి అంటే గత ఐదు నెలలుగా చెంగమ్మకు పింఛను డబ్బులు అందట్లేదు. దీంతో ఆమె ఇన్నాళ్లుగా ప్రభుత్వ కార్యాలయంతో పాటు ఎమ్మెల్యే ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి విసిగి పోయింది. ఎవరిని వేడుకున్నా తన సమస్య పరిష్కారం కాకపోవడంతో నిరాహార ధీక్షకు పూనుకుంది. ఇందుకోసం స్థానిక ఎమ్మెల్యే ఇంటినే వేదికగా నిర్ణయించుకుంది. 

ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట పింఛన్ బుక్కు చేతబట్టుకుని ఎమ్మెల్యేగారే తనకు న్యాయం చేయాలన్న ప్లకార్డును పట్టుకుని బైఠాయించి నిరాహార దీక్ష చేస్తోంది. ఇప్పటికైనా తనకు పింఛన్ అందించాల్సిందిగా అధికారులను ఎమ్మెల్యే ఆదేశించాలని అభ్యర్థిస్తోంది. ఇలా వృద్ధురాలు నిరాహార దీక్షకు దిగడం అదీ ఎమ్మెల్యే ఇంటిముందే కావడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

దీంతో స్పందించిన స్థానిక పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆమెను స్థానిక ఎంపిడిఓ కార్యాలయంకి తీసుకెళ్లారు. పింఛన్ పత్రాలను పరిశీలించిన ఎంపీడీవో దయానందం... మూడు నెలలు వరుసగా పింఛన్ తీసుకోనందున చెంగమ్మ పేరు తొలగించాల్సి వచ్చిందని తెలిపారు. మళ్లీ ఆమె పేరును నమోదు చేసి పెన్షన్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మాట విన్న ఆ అవ్వ ముఖంలో సంతోషం తొనికిసలాడింది.

వీడియో కోసం పక్కనున్న లింక్ పై క్లిక్ చేయండి   video news : ఎమ్మెల్యే ఇంటిముందు వృద్ధురాలి ధర్నా..ఎందుకంటే...

తనకు న్యాయం జరిగేలా చూసిన పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అయితే తన సమస్య పరిష్కారం కోసం తెగువ చూపిన వృద్దురాలు చెంగమ్మను స్థానికులు అభినందిస్తున్నారు.     

click me!