4లక్షల 27 వేల పెన్షన్లు తొలగించాం... నారావారిపల్లెలో కూడా...: మంత్రి పెద్దిరెడ్డి

By Arun Kumar PFirst Published Feb 4, 2020, 4:39 PM IST
Highlights

అర్హులకు ఇంటివద్దే  పెన్షన్లు అందించాలన్న సదుద్దేశంతో తమ ప్రభుత్వం వుంటే... ఇదే పెన్షన్లను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయాలని తెలుగుదేశం నాయకులు ప్రయత్నిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. 

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వున్న అర్హులైన పెన్షనర్లందరికీ ఇంటివద్దే నగదును అందించే బృహత్తర కార్యక్రమానికి తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇలా కేవలం ఒక్కరోజులోనే 88.85 శాతం పెన్షన్లు అదించిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని మంత్రి అన్నారు. 

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలకు పెన్షన్లను ఇచ్చారని ఆరోపించారు. అంతేకాకుండా చాలామంది అనర్హులకు పెన్షన్లు అందించి అర్హులను విస్మరించారని అన్నారు. అందువల్లే గత ప్రభుత్వంలో ఉన్న 4లక్షల 27 వేల మంది అనర్హులను తొలగించినట్లు మంత్రి తెలిపారు. 

read more  నారావారిపల్లెలో వైసీపీ సభ: చంద్రబాబు స్పందన ఇదీ

అయితే 5 లక్షల79 వేల మందిని కొత్తగా అర్హులుగా చేర్చినట్లు వెల్లడించారు. ఇప్పటికీ పెన్షన్లు రాకుండా అర్హత ఉన్నవారికి ఐదు రోజుల్లో కొత్తగా మంజూరు చేస్తామని ప్రకటించారు. 50 వేల మందికి మూడు రోజుల్లో పెన్షన్లు జారీ చేస్తామని తెలిపారు.

ప్రతి గ్రామ సచివాలయంలోనూ పెన్షన్లు పొందేందుకు అర్హులయిన వారి జాబితాను పెట్టామన్నారు. ఇలా చంద్రబాబు స్వగ్రామమైన నారావారి పల్లెలో కూడా అర్హుల జాబితాను బహిరంగంగానే సచివాలయంలో ప్రదర్శించామన్నారు. పెన్షన్ల విషయంలో రాజకీయాలు చేయాలని టిడిపి వారు భావిస్తున్నారు కానీ తమకు మాత్రం ఈ విషయాన్ని రాజకీయాల్లోకి లాగాలని లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 

click me!