ప్రధాని నరేంద్ర మోదీకి ఏపి సీఎం జగన్ లేఖ

By Arun Kumar PFirst Published Feb 1, 2020, 3:53 PM IST
Highlights

చైనాలో చిక్కుకున్న 35 మంది తెలుగు ఇంజనీర్లను ఇండియాకు రప్పించే ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. 

అమరావతి: చైనాలో విజృంభిస్తున్న అతి భయంకర కరోనా వైరస్ బారిన పడకుండా తెలుగు ఉద్యోగులను కాపాడే ప్రయత్నం చేస్తోంది ఏపి ప్రభుత్వం. విశాఖపట్నానికి చెందిన  కొందరు ఉద్యోగ పనులపై చైనాకు వెళ్లారు. కరోనా వైరస్ వ్యాప్తిచెందుతుండటంలో చైనా ప్రభుత్వం ఆంక్షలు దేశవ్యాప్తంగా విధించిన నేపథ్యంలో ఈ ఉద్యోగులు అక్కడే చిక్కుకున్నారు. వీరిని కాపాడాల్సిందిగా జగన్ ప్రధాని మోదీని కోరారు. 

చైనాకు చెందిన ప్యానెల్ ఆప్టో డిస్ ప్లే టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్(POTPL) అనే సంస్థ 2019 లో విశాఖపట్నం నుంచి 35 మంది యువ ఇంజినీర్లను ట్రైనింగ్ కోసం చైనాకు తీసుకెళ్లింది. ఈ ట్రైనింగ్ తర్వాత వీరు తిరుపతిలో పనిచేయాల్సి  వుంటుంది.  అయితే ప్రస్తుతం చైనాలో కరోనా వైరస్ ప్రజల ప్రాణాలను బలితీసుకుంటుండటంతో సదరు ఇంజనీర్లు ఆందోళన చెందుతున్నారు. అయితే చైనాలో విధించిన హెల్త్ ఎమర్జన్సీ కారణంగా వారు స్వదేశం ఇండియాకు రాలేకపోతున్నారు. 

video  

చైనాలో చిక్కుకున్న వీరిని కాపాడాలంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రధానికి లేఖ రాశారు. ప్రత్యేక చొరవ తీసుకుని విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడి ఉద్యోగులను ఏపీకి తీసుకురావాలని లేఖలో సీఎం జగన్ కోరారు. 

ప్రస్తుతం ఈ 35మంది ఇంజనీర్లు వ్యుహన్ నగరంలో వున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ నగరంలోనే కరోనా వ్యాప్తి అధికంగా వుంది. దీంతో ఎలాగయినా తమవారిని ఇండియాకు తీసుకురావాలని... చైనాలోనే వుంటే కరోనా బారిన ఎక్కడ పడతారేమోనని భయపడుతున్నట్లు కుటుంబసభ్యులు ఆందోళనను వ్యక్తం చేశారు. 
 

  

click me!