చిత్తూరు జిల్లాపై మంత్రి మేకపాటి హామీల వర్షం...

By Arun Kumar P  |  First Published Nov 28, 2019, 9:41 PM IST

చిత్తూరు జిల్లాను రాష్ట్రంలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఇంచార్జి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇంచార్జ్ మంత్రి హోదాలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో  జరిగిన డిఆర్సి సమావేశంలో ఆయన ప్రసంగించారు.   


చిత్తూరు: నవరత్నాల అమలు ద్వారా అన్ని వర్గాల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖామాత్యులు మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఉదయం చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా సమీక్షా సమావేశం(డిఆర్సి) జిల్లా ఇంచార్జ్ మంత్రి అధ్యక్షతన జరిగింది. 

ఈ సందర్భంగా మంత్రి మేకపాటి మాట్లాడుతూ.... ప్రజలకు పారదర్శకమైన, అవినీతి రహిత పాలనను అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని తెలిపారు.  కొత్తగా వచ్చిన ప్రభుత్వం 6 నెలల కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడం జరిగిందని... అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ కార్యక్రమాలను అందించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.

Latest Videos

undefined

read more  అమరావతి నిర్మాణంపై రగడ... ఎక్స్‌పర్ట్ కమిటీతో సీఎం జగన్ సమావేశం

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసి‌, ప్రభుత్వ సేవలను సులభతరం చేసేందుకు గ్రామ సచివాలయాల వ్యవస్థను తీసుకురావడం జరిగిందని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనంతో ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలోనూ ... రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే చెందుతుందని తెలిపారు. 

రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిన 10 షుగర్ ఫ్యాక్టరీ లను పునరుద్ధరించుటలో భాగంగా మొదటి దశలో 7 షుగర్ ఫ్యాక్టరీలను పునరుద్ధరించుటకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.  ఇందులో రేణిగుంట షుగర్ ఫ్యాక్టరీ  కూడా వుందని, రెండవ దశలో చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీని కూడా పునరుద్ధరించుటకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

video:చిత్తూరు జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తా: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

ఇప్పటికే మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలను పునః ప్రారంభించడమే కాకుండా.. గత ప్రభుత్వంలోని వేతన బకాయిలు కూడా చెల్లించే ప్రక్రియ పూర్తవుతోందని మంత్రి అన్నారు.  చిత్తూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చర్ క్లస్టర్ ద్వారా ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలను కల్పించడం జరుగుతుందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు.


 
 

click me!