తిరుమల సమాచారం

By telugu teamFirst Published Oct 9, 2019, 9:44 AM IST
Highlights

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేలసంఖ్యలో తరలి వస్తున్నారు. తిరుమలలో ఆలయ అధికారలు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం స్వామివారి చక్రస్నానం కూడా ఘనంగా జరిగింది. 

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేలసంఖ్యలో తరలి వస్తున్నారు. తిరుమలలో ఆలయ అధికారలు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం స్వామివారి చక్రస్నానం కూడా ఘనంగా జరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి తిరుమలలో: 21C°-28℃° ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

• నిన్న 94,147 మంది  భక్తులకు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. 

• స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 24 గదులలో భక్తులు వేచి ఉన్నారు,

 • ఈ సమయం శ్రీవారి  సర్వదర్శనాని కి సుమారు 14 గంటలు పట్టే అవకాశం ఉంది.

• నిన్న స్వామివారికి  హుండీలో భక్తులు  సమర్పించిన నగదు రూ. 2.20 కోట్లు,

•  శీఘ్రసర్వదర్శనం(SSD),  ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్   ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పడుతుంది.

వయోవృద్దులు / దివ్యాంగుల కోసం ప్రత్యేయకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ ద్వారా ఉ:10 గంటలకి (750) మ: 2 గంటలకి (750)  ఇస్తారు.చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలకు అవకాశం కల్పిస్తున్నారు.

• సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు ఉ: 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు,

click me!