బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.20.40 కోట్లు: టీటీడీ ఈవో

By Siva KodatiFirst Published Oct 8, 2019, 4:07 PM IST
Highlights

ఈ ఏడాది తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించామన్నారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 8 రోజుల్లో 7.07 లక్షల మందికి దర్శన భాగ్యం కల్పించామని వెల్లడించారు

ఈ ఏడాది తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించామన్నారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 8 రోజుల్లో 7.07 లక్షల మందికి దర్శన భాగ్యం కల్పించామని వెల్లడించారు.

హుండీ ద్వారా రూ.20.40 కోట్లు ఆదాయం లభించిందని.. 3.23 లక్షల మంది తలనీలాలు సమర్పించుకున్నారని ఈవో తెలిపారు. సోమవారం ఒక్కరోజే సుమారు లక్షా 5 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని అనిల్ కుమార్ వెల్లడించారు.

15.20 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందజేశామని , సుమారు 34 లక్షల లడ్డూలను విక్రయించామని ఈవో పేర్కొన్నారు. లక్షా 42 వేల మంది చిన్నారులకు ట్యాగింగ్ చేశామని.. అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.

మరోవైపు మంగళవారం ఉదయం శ్రీవారి చక్రస్నానం వైభవంగా జరిగింది. లక్షలాది మంది భక్తులు ఈ వేడుకను తిలకించి అనంతరం శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేశారు. 

click me!