వేద విద్వత్ సదస్సులు దేశమంతా జరగాలని, తద్వారా వేద విజ్ఞానం అందరికీ చేరువ కావాలని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి ఆకాంక్షించారు
వేద విద్వత్ సదస్సులు దేశమంతా జరగాలని, తద్వారా వేద విజ్ఞానం అందరికీ చేరువ కావాలని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి ఆకాంక్షించారు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని ఆస్థానమండపంలో 9 రోజుల పాటు జరిగిన శ్రీ శ్రీనివాస వేద విద్వత్ సదస్సులు మంగళవారం ముగిశాయి.
ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఈ చతుర్వేద సభలు ప్రత్యేక ఆకర్షణగా వెలుగొందాయన్నారు. ఈ సదస్సులకు ఆమోదం తెలిపిన అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, తిరుపతి జెఈవో బసంత్ కుమార్‌ను ప్రశంసించారు.
శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా.ఆకెళ్ల విభీషణ శర్మ ఈ సదస్సులను చక్కగా నిర్వహించారని కొనియాడారు.