తిరుమలలో అగ్నిప్రమాదం: బూంది పోటులో చెలరేగిన మంటలు

By sivanagaprasad KodatiFirst Published Dec 8, 2019, 2:26 PM IST
Highlights

తిరుమలలో అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీవారికి ప్రసాదాలు తయారు చేసే బూంది పోటులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో రెండు ఫైరింజిన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. 

Also Read:బెజవాడలో దారుణం: స్నానం చేస్తున్న కూతురి ఫోటోలు తీసిన తల్లి, చివరికిలా..

బూంది తయారు చేస్తుండగా స్టవ్ నుంచి మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. ప్రమాదం సంభవించిన సమయంలో లడ్డూ ప్రసాదం తయారు చేసేందుకు సుమారు 40 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు.

Also read:బిజెపితో ఒప్పందం: ఢిల్లీలో పవన్ కల్యాణ్ రహస్య భేటీలు?

మంటలు పక్క భవనాలకు వ్యాపించకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఇదే బూంది పోటులో అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ప్రతి పౌర్ణమి, అమావాస్య రోజు ఈ ప్రాంతంలో బూంది తయారు చేయడాన్ని నిలిపివేసి పోటును శుభ్రపరుస్తారు. దీనిపై టీటీడీ విజిలెన్స్ శాఖ దర్యాప్తు చేస్తోంది. 

click me!