టిటిడికి ఒకేరోజు రూ.80 లక్షల విరాళం

Published : Oct 11, 2019, 07:20 PM IST
టిటిడికి ఒకేరోజు రూ.80  లక్షల విరాళం

సారాంశం

తిరుమల శ్రీవారికి ఇవాళ(శుక్రవారం) భక్తులు భారీగా విరాళాలు  సమర్పించుకున్నారు. కేవలం ఇద్దరు భక్తులే భాీర మొత్తంలో విరాళాలు అందించారు.   

టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ప్ర‌త్యేక ఆహ్వానితులైన బెంగ‌ళూరుకు చెందిన  కూపేంద‌ర్‌రెడ్డి శుక్ర‌వారం రూ.70 ల‌క్ష‌లు విలువైన 2 మ‌హేంద్ర అల్టూర‌స్ జి4 కార్ల‌ను 
స్వామివారి సేవకోసం విరాళంగా అందించారు. ఈ మేర‌కు 2 కార్ల‌కు శ్రీ‌వారి ఆల‌యం ఎదుట పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం వాహ‌నాల రికార్డుల‌ను టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు.

అలాగే మ‌లేసియాకు చెందిన ప్ర‌వాస భార‌తీయులు ర‌వీంద్ర సుబ్ర‌మ‌ణియ‌మ్ కూడా శ్రీవేంకటేశ్వర సర్వశ్రేయ ట్రస్టు కు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు విరాళం డిడిని శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో టిటిడి ఛైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డికి అంద‌జేశారు.
 

PREV
click me!

Recommended Stories

వెంకన్న భక్తులకు శుభవార్త.. తిరుపతికి ప్రత్యేక రైలు
లడ్డూ వివాదం తర్వాత తిరుమలలో భారీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్.. వివ‌రాలు ఇవిగో