తిరుమల సమాచారం .. భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్

By narsimha lodeFirst Published Oct 11, 2019, 3:46 PM IST
Highlights

తిరుమల  శ్రీవారి దర్శనం కోసం  భక్తులు  పోటేత్తుతున్నారు. సెలవులు కావడంతో  స్వామిని దర్శంచుకోవడం కోసం భారీ సంఖ్యలో  తిరుమలకు  విచ్చేస్తున్నారు. వాతావరణం పరిస్థితులు అనుకూలించకపోయినప్పటికీ తిరుమలలో భక్తుల రద్ధీ మాత్రం కొనసాగుతోంది. 

తిరుమల  శ్రీవారి దర్శనం కోసం  భక్తులు  పోటేత్తుతున్నారు. సెలవులు కావడంతో  స్వామిని దర్శంచుకోవడం కోసం భారీ సంఖ్యలో  తిరుమలకు  విచ్చేస్తున్నారు. వాతావరణం పరిస్థితులు అనుకూలించకపోయినప్పటికీ తిరుమలలో భక్తుల రద్ధీ మాత్రం కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటల  సమయానికి  తిరుమలలో 20C°-28℃°• ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. 


గురువారం రోజున  84,490 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు అన్ని భక్తులతో నిండిపోయాయి. దీంతో చాలా మంది చాలా మంది భక్తులు  బయట వేచి ఉన్నారు. రద్దీ అధికంగా ఉండడంతో  శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటలు పట్టవచ్చును  గురువారం నాటి స్వామివారి హుండీ అదాయం  ₹: 2.95 కోట్ల వచ్చినట్లుగా టీటీడీ అధికారులు  తెలిపారు. శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక)  వారికి   సుమారుగా రెండు గంటల సమయం పడుతుంది. 
 

శ్రీవారి దర్శనం కోసం వచ్చే వృద్దులు, దివ్యాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. వారికి కోసం టీటీడీ ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. అక్టోబ‌రు 15, 29న వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ఉచిత దర్శనం అక్టోబ‌రు 16, 30 తేదీల్లో చంటిపిల్లల తల్లిదండ్రులకు  శ్రీవారి ప్రత్యేక ప్రవేశ  దర్శనానికి అనుమతించనున్నారు. ఉ: 9 నుండి మ:1.30 వ‌ర‌కు సుపథం మార్గం ద్వారా ఈ దర్శనానికి  అనుమతిస్తారు,

click me!