విషాదం... కరెంట్ షాక్ కు కుటుంబం మొత్తం బలి

By Arun Kumar P  |  First Published Dec 9, 2019, 5:26 PM IST

తిరుపతి సమీపంలోని అటవీ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. జీవనోపాధి కోసం అటవీ ప్రాంతానికి వెళ్లిన ఒకే కుటంబానికి చెందిన ముగ్గురు ప్రమాాదవశాత్తు మృతిచెందారు.  


చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని అటవీప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఏర్పేడు మండలపరిధిలోని వాగివేడు పంచాయతీ వెల్లంపల్లి గ్రామానికి  చెందిన ఓ  కుటుంబంలో ముగ్గురు కరెంట్ షాక్ బలయ్యారు. ఈ ఘటనలో ఐదేళ్ళ చిన్నారి కూడా ప్రాణాలు వదలాడు. 

గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన కృష్ణయ్య (50), చెంచమ్మ (36)లు కట్టెలు అమ్ముకుని జీవనం సాగిస్తుంటారు. ఈ క్రమంలోనే వీరు గౌతమ్(5) అనే చిన్నారిని తీసుకుని సమీప అటవీప్రాంతంలో కట్టెలు తీసుకురావడానికి వెళ్లారు. 

Latest Videos

undefined

Video: దిశ నిందితుల ఎన్‌కౌంటర్... హ్యాట్సాఫ్ టు కేసీఆర్..: వైఎస్ జగన్

ఇలా అడవిలో సేకరించిన కట్టెల మోపును తీసుకుని ఇంటికి  వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. కరెంట్ తీగలకు తాకడంతో వీరు ముగ్గురు విద్యాదాఘాతానికి  గురయి అక్కడికక్కడే మృతి చెందారు.

ఒకే కుటుంబానికి  చెందిన ముగ్గురు ఇలా ప్రమాదానికి గురయి మరణించడంతో బందువులే కాదు గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. ముఖ్యంగా చిన్నారి మృతి మరింత వేధనను కలిగిస్తోంది. 

read more జగన్ ప్రభుత్వ కీలక నిర్ణయం... వారికోసం ప్రత్యేకంగా ప్రభుత్వ శాఖ

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, విద్యుత్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను విద్యుత్ వైర్లకు దూరంగా జరిపారు. ఆ  తర్వాత వాటిని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. 

click me!