ప్రేమించినవాడి చేతిలో మోసపోయిన యువతి...ప్రియుడి ఇంటిముందు ధర్నా

Published : Dec 09, 2019, 08:31 PM IST
ప్రేమించినవాడి చేతిలో మోసపోయిన యువతి...ప్రియుడి ఇంటిముందు ధర్నా

సారాంశం

ప్రేమించినవాడి చేతిలో మోసపోయి ఓ యువతి అతడి ఇంటిముందు ధర్నాకు దిగిన సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.  

తిరుపతి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి చిత్తూరు జిల్లాలో ధర్నాకు దిగింది. పెద్దల ద్వారా పెళ్లి చూపులకు వచ్చి తరువాత తనను  ఇష్టపడ్డానని... ప్రేమిస్తున్నానని వెంటపడటంతో అతని మాటలు నమ్మినట్లు యువతి తెలిపింది. ఇప్పుడు పెళ్లిచేసుకోడానికి నిరాకరిస్తున్నాడంటూ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. 

పీలేరు మండలం రేగళ్లు పంచాయతీ నగిరి గ్రామానికి చెందిన మణికంఠ అనే యువకుడికి తిరుపతి కొర్లగుంటలో ఉంటున్న ఓ యువతితో పెళ్లిచూపులు జరిగాయి. అయితే పెళ్లికి పెద్దల మధ్య మాటామంతీ జరగకున్నా వీరిద్దరు ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలోనే దాదాపు నాలుగు నెలలపాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. 

read more విషాదం... కరెంట్ షాక్ కు కుటుంబం మొత్తం బలి

యువతి తల్లిదండ్రులుకు మణికంఠతో పెళ్లికి అంగీకరించలేదు. అయినప్పటికి పెళ్లి చేసుకుంటానని యువతిని అమ్మాయిని నమ్మించి బెంగుళూరుకు కూడా తీసుకెళ్ళాడు. అక్కడ వారిద్దరు చాలారోజులు కలిసివున్నారు. 

ఇలాపెళ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగు నెలల పాటు తనతో తిరిగి ఇప్పుడు ఎక్కువ కట్నం కోసం ఇంకో పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడంటూ యువతి ఆరోపిస్తోంది. దీంతో తనకు న్యాయం కావాలంటూ సదరు యువతి మణికంఠ నివాసం ముందు ధర్నాకు దిగింది.  

 

PREV
click me!

Recommended Stories

వెంకన్న భక్తులకు శుభవార్త.. తిరుపతికి ప్రత్యేక రైలు
లడ్డూ వివాదం తర్వాత తిరుమలలో భారీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్.. వివ‌రాలు ఇవిగో