Tips and Tricks: ప్లాస్టిక్ డబ్బాల్లో వీటిని అస్సలు పెట్టద్దు! ఎందుకో తెలుసా?

Published : Jun 16, 2025, 01:38 PM IST
Tips and Tricks: ప్లాస్టిక్ డబ్బాల్లో వీటిని అస్సలు పెట్టద్దు! ఎందుకో తెలుసా?

సారాంశం

ప్లాస్టిక్ డబ్బాలను మనం రెగ్యులర్ గా వాడుతుంటాం. తక్కువ ధరలో వస్తాయి. వాడటానికి అనువుగా ఉంటాయి. కాబట్టి చాలామంది ఆహార, ఇతర పదార్థాలు నిల్వ చేయడానికి ప్లాస్టిక్ బాక్స్ లను వాడుతుంటారు. కానీ వీటిలో కొన్ని వస్తువులను అస్సలు పెట్టకూడదట. ఎందుకో చూద్దాం.  

మనం ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలను రెగ్యులర్ గా వాడుతుంటాం. పప్పులు, ఇతర ఆహార పదార్థాలు, కొన్ని వాడుకోని వస్తువులను పెద్ద పెద్ద ప్లాస్టిక్ బాక్సుల్లో నిల్వ చేస్తుంటాం. సాధారణంగా ప్లాస్టిక్ డబ్బాలు తేలికగా ఉంటాయి. వాడటానికి ఈజీగా ఉంటాయి. ధర కూడా తక్కువగానే ఉంటుంది. కాబట్టి ఎక్కువమంది.. కిచెన్ లో, ఇతర షాపుల్లో ప్లాస్టిక్ డబ్బాలను వాడుతుంటారు. కానీ ప్లాస్టిక్ డబ్బాల్లో కొన్ని రకాల వస్తువులను పెట్టడం మంచిది కాదట. ఏ వస్తువులను పెట్టకూడదు ఎందుకు పెట్టకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టకూడని వస్తువులు  

లెదర్ వస్తువులు

లెదర్ వస్తువులను ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టకూడదట. లెదర్ డబ్బాలకు అంటుకుపోయే అవకాశం ఉందట. డబ్బాలో తేమ ఉంటే కూడా లెదర్ వస్తువులు చెడిపోతాయట.

ఎలక్ట్రానిక్ వస్తువులు

ఎక్కువ వేడి, తేమ ఉన్న చోట ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్న ప్లాస్టిక్ డబ్బాను పెట్టకూడదు. దానివల్ల డబ్బాలోని వస్తువులు పాడవుతాయి. సిలికా జెల్ ప్యాకెట్లు డబ్బాలో పెడితే తేమ పట్టకుండా ఉంటుంది.

రసాయనాలు

వాతావరణ మార్పులు రసాయన పదార్థాలపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. కాబట్టి వేడి, చలి మారుతూ ఉండే చోట రసాయనాలు స్టోర్ చేసిన ప్లాస్టిక్ డబ్బాలు పెట్టకూడదు. రసాయనాలు రియాక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది.

ఆహార పదార్థాలు

తిని మిగిలినవి, తినే వస్తువులు ప్లాస్టిక్ డబ్బాల్లో పెడితే జాగ్రత్త. వేడి ఎక్కువైతే ప్లాస్టిక్ లోని కెమికల్స్ తిండిలో కలుస్తాయి. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.

తడి వస్తువులు

కొన్ని రకాల ఆహార పదార్థాలను ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టకూడదు. మరీ ముఖ్యంగా ఓపెన్ చేసిన ఫుడ్ ప్యాకెట్లు. తేమ వల్ల వాటికి ఫంగస్ వస్తుంది. కాబట్టి ప్లాస్టిక్ డబ్బా ఆరబెట్టిన తర్వాతే వాడటం మంచిది.

బ్యాటరీలు

బ్యాటరీలు ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టకపోవడమే మంచిది. ఒకదానికొకటి రాసుకుంటే ప్రమాదం జరగవచ్చు. వాతావరణంలో మార్పులు వీటి మీద ప్రభావం చూపుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

ప్లాస్టిక్ డబ్బాల్లో సామానులు పెట్టేటప్పుడు ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. వేడి ఎక్కువైనప్పుడు ప్లాస్టిక్ లోని బిస్ఫెనాల్-ఎ అనే కెమికల్ ఆహార పదార్థాల్లో కలుస్తుంది. ఆ పదార్థాలు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

వీటితో ఇల్లు తుడిస్తే చాలు.. బొద్దింకలు, బల్లులు పరార్
నాన్ స్టిక్ పాత్రను ఎంతకాలం వాడొచ్చు? వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?