నేను దాడి చేయలేదు, వాళ్లే దాడి చేశారు: జిల్లా పరిషత్ వైస్ ఛైర్మెన్ కృష్ణ

By narsimha lodeFirst Published Jun 30, 2019, 12:01 PM IST
Highlights

 తాను ఎవరిపై దాడికి పాల్పడలేదని కొమరం భీం జిల్లా పరిషత్ వైస్ ఛైర్మెన్ కోనేరు కృష్ణ చెప్పారు. కాగజ్‌నగర్ మండలంలోని సార్సాలో ఎప్ఆర్‌ఓ అనితపై దాడి ఘటనపై ఆయన స్పందించారు.

 కాగజ్‌నగర్: తాను ఎవరిపై దాడికి పాల్పడలేదని కొమరం భీం జిల్లా పరిషత్ వైస్ ఛైర్మెన్ కోనేరు కృష్ణ చెప్పారు. కాగజ్‌నగర్ మండలంలోని సార్సాలో ఎప్ఆర్‌ఓ అనితపై దాడి ఘటనపై ఆయన స్పందించారు.

తాను ఎవరిపై దాడి కానీ, దౌర్జన్యానికి కానీ పాల్పడలేదని  ఆయన చెప్పారు. ఫారెస్ట్ అధికారులే దౌర్జన్యం చేశారని ఆయన ఆరోపించారు.పట్టా భూమిలో ఫారెస్ట్ అధికారులు చదును చేస్తున్నారనే విషయమై తనకు ఫోన్ వస్తే అక్కడికి వెళ్లినట్టుగా కృష్ణ వివరించారు. పట్టా భూమిలో ఫారెస్ట్ అధికారులు దున్నుతుంటే అడ్డుకొన్నట్టుగా జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ చెప్పారు. 

కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి అనే వ్యక్తి భూమిని చదును చేసే ప్రయత్నం చేస్తే అడ్డుకొన్నట్టుగా  జిల్లా పరిషత్  వైస్ చైర్మెన్ కృష్ణ చెప్పారు. ఫారెస్ట్ అధికారులపై తాను దాడి చేయలేదన్నారు.కాంగ్రెస్‌కు చెందిన ట్రాక్టర్లతో చదును చేస్తున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

తాను కానీ తన అనుచరులు కానీ ఫారెస్ట్ అధికారులపై దాడికి పాల్పడలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ట్రాక్టర్లను ఎందుకు తెచ్చారని కోపంతో  ట్రాక్టర్లపై దాడి చేశారని చెప్పారు.

సంబంధిత వార్తలు

మహిళా ఫారెస్ట్ అధికారిని చితకబాదిన జడ్పీ వైఎస్ ఛైర్మన్ (వీడియో)
 

click me!