జుట్టుపట్టుకు లాగారు.. మొదట కొట్టింది కోనేరు కృష్ణే: ఎఫ్ఆర్‌వో అనిత

Siva Kodati |  
Published : Jun 30, 2019, 11:52 AM IST
జుట్టుపట్టుకు లాగారు.. మొదట కొట్టింది కోనేరు కృష్ణే: ఎఫ్ఆర్‌వో అనిత

సారాంశం

తనపై ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తమ్ముడు కోనేరు కృష్ణ దాడి చేశారని కన్నీటీ పర్యంతమయ్యారు ఎఫ్ఆర్‌వో అనిత... టీఆర్ఎస్ నేత దాడిలో తీవ్రగాయాల పాలైన ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఘటన గురించి తెలిపారు

తనపై ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తమ్ముడు కోనేరు కృష్ణ దాడి చేశారని కన్నీటీ పర్యంతమయ్యారు ఎఫ్ఆర్‌వో అనిత... టీఆర్ఎస్ నేత దాడిలో తీవ్రగాయాల పాలైన ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఘటన గురించి తెలిపారు.  

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రత్యామ్నాయ అటవీకరణ పనుల్లో భాగంగా తాము సిబ్బందితో కలిసి కాగజ్ నగర్ మండలం సార్సాల గ్రామంలోని కంపార్ట్‌మెంట్ నెంబర్ 138, 139 ఏరియాలో 20 ఏకరాలు మొక్కలు నాటేందుకు ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు.

దీనిలో భాగంగా మొక్కలు నాటేందుకని ట్రాక్టర్లతో భూమిని చదును చేస్తున్నామని ఈ సమయంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తమ్ముడు.. కోనేరు కృష్ణ తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నారని అనిత తెలిపారు.

వచ్చి రావడంతోనే తనపైనా, సిబ్బందిపైనా కర్రలతో దాడి చేశారని.. మహిళను అని కూడా చూడకుండా జుట్టుపట్టుకుని కిందకు లాగి తలపై కర్రతో కొట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

దారుణం: మహిళా ఫారెస్ట్ అధికారిని చితకబాదిన జడ్పీ ఛైర్మన్ (వీడియో)

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!