జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అవమానించడాన్ని బీఆర్ఎస్ సీనియర్ నేతలు తప్పుపట్టారు. మంత్రి ప్రవర్తనను ఖండించారు. వెంటనే సందీప్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Komatireddy Venkatreddy: యాదాద్రి జిల్లా జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అవమానించిన ఘటన కలకలం రేపింది. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరులో నిర్మించిన కొత్త గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమయంలో ఆయన మాట్లాడుతూ కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ రేవంత్ రెడ్డి కాలిగోటికి కూడా సరిపోడని ఫైర్ అయ్యారు. కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. ఆ తర్వాత జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి కూడా తండ్రి మాధవరెడ్డి పేరు చెప్పుకునే జెడ్పీటీసీ అయ్యాడని పేర్కొన్నారు. లేదంటే ఆయన సర్పంచ్‌గా కూడా పనికిరాడని మాటలు వదిలేయడంతో సందీప్ రెడ్డి సహనం కోల్పోయారు. వెంటనే నిలబడి మంత్రిని నిలదీశారు.
ఏం మాట్లాడుతున్నారని సందీప్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి మరింత ఆగ్రహించి ఆయనను అక్కడి నుంచి తీసుకెళ్లాలని పోలీసులను ఆదేశించారు. పోలీసులు బలవంతంగా సందీప్ రెడ్డిని వేదిక వద్ద నుంచి తీసుకెళ్లారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి సహా పలువురు గులాబీ నేతలు మండిపడ్డారు.
undefined
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు గర్హనీయం అని, ఇది కాంగ్రెస్ నియంతృత్వ పోకడలకు నిదర్శనం అని హరీశ్ రావు ఆగ్రహించారు. ప్రజాస్వామ్యవాదులంతా కోమటిరెడ్డి పోకడలను ప్రతిఘటించానలని అన్నారు. సందీప్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read: Janasena: జనసేన మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం జగన్.. ‘ఇది సబబేనా?’
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెంటనే సందీప్ రెడ్డికి వెంటనే క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ మంత్రుల అహంకార వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని వివరించారు. కాంగ్రెస్ మంత్రులు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు.