గృహ జ్యోతి కింద ఈ రోజు నుంచే జీరో కరెంట్ బిల్లులు జారీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఒక వేళ ఈ పథకం కింద జీరో బిల్లులు రాకుంటే సమీప మున్సిపల్ లేదా మండల కార్యాలయాలకు వెళ్లి మరోసారి దరఖాస్తు చేసుకోవాలి.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నది. ఇప్పుడు మరో గ్యారంటీ అమల్లోకి వచ్చింది. 200 యూనిట్ల కంటే తక్కువగా విద్యుత్ వినియోగిస్తున్న కుటుంబాలకు ఉచితంగా ఆ సేవలు అందించాలనేది కాంగ్రెస్ గ్యారంటీ. గృహజ్యోతి పేరుతో ఈ గ్యారంటీని ప్రకటించింది. తాజాగా ఈ ఉచిత కరెంట్ హామీని కూడా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ హామీ అమలుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నది.
నేటి నుంచే ఈ పథకం అమలు అవుతుందని తెలుస్తున్నది. ఇవాళ్టి నుంచే జీరో కరెంట్ బిల్లులు జారీ అవుతాయని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెక్షన్‌లలో నేటి నుంచే ఈ బిల్లులు జారీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
గృహ జ్యోతి పథకానికి 1,09,01,255 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాల సంఖ్య 64 లక్షలు. అందులోనూ ఈ పథకానికి 34,59,585 మందిని ఈ పథకానికి అర్హులుగా గుర్తింపు పొందారు.
Also Read: రాహుల్ గాంధీ పోటీ తెలంగాణ నుంచే.. ప్రధాని అవుతారు: మంత్రి పొంగులేటి
ఒక వేళ ఈ పథకానికి కావాల్సిన అర్హతలు ఉననా.. జీరో బిల్లు రాకుంటే వారు దగ్గరలోని మున్సిపల్ లేదా మండల కార్యాలయాలను సంప్రదించవచ్చు. అక్కడ వారు మరోమారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తుతోపాటు తెల్ల రేషన్ కార్డు, దానికి లింక్ చేసిన ఆధార్ కార్డు, విద్యుత్ కనెక్షన్ నెంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది.