బీఆర్ఎస్‌కు షాక్: బీజేపీలో చేరిన జహీరాబాద్ ఎంపీ బి.బి.పాటిల్

Published : Mar 01, 2024, 04:35 PM ISTUpdated : Mar 01, 2024, 04:52 PM IST
 బీఆర్ఎస్‌కు షాక్: బీజేపీలో చేరిన జహీరాబాద్ ఎంపీ బి.బి.పాటిల్

సారాంశం

బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది.  జహీరాబాద్ ఎంపీ బి.బి. పాటిల్  బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. 

జహీరాబాద్ ఎంపీ, బీఆర్ఎస్ నేత బీబీ పాటిల్  శుక్రవారం నాడు  బీజేపీ లో చేరారు. బీజేపీలో చేరడానికి ముందే  బీబీ పాటిల్  బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. నిన్ననే నాగర్ కర్నూల్ ఎంపీ  పి. రాములు  బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

also read:నల్లమిల్లి, సత్తి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు: ఆనపర్తిలో ఉద్రిక్తత

శుక్రవారం నాడు  న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో  కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్,  బీజేపీ తెలంగాణ ఇంచార్జీ  తరుణ్ చుగ్,  బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ సమక్షంలో  బి.బి. పాటిల్  బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

also read:కారణమిదీ:మార్చి 2న బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ప్రత్యేక లైవ్ ట్రేడింగ్

2014, 2019 ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుండి  బి.బి. పాటిల్  బీఆర్ఎస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది.  దీంతో  కొందరు బీఆర్ఎస్ నేతలు  ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.

 

 రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమి పాలు కావడంతో పాటు ఇతరత్రా కారణాలు కూడ  నేతలు  ఇతర పార్టీల్లో చేరడానికి  కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

also read:జనసేనను చంద్రబాబు నిర్వీర్యం చేస్తారు: పవన్ కు హరిరామ జోగయ్య మరో లేఖ

పెద్దపల్లి ఎంపీ  వెంకటేష్  గత మాసంలోనే  బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా  ఇద్దరు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు  బీజేపీలో  చేరారు.  వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి  అభ్యర్థుల ఎంపిక కోసం ప్రధాన పార్టీలు సన్నద్దమౌతున్న తరుణంలో  ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు  బీఆర్ఎస్ ను వీడడం చర్చకు దారి తీసింది. 

also read:లాస్య నందిత మృతి:పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు, టిప్పర్ గుర్తింపు

తెలంగాణ రాష్ట్రం నుండి  రెండంకెల  స్థానాల్లో  ఎంపీ సీట్లను కైవసం చేసుకోవాలని  బీజేపీ వ్యూహారచన చేస్తుంది.ఈ క్రమంలోనే  కమల దళం  బీఆర్ఎస్ నేతలకు వల వేస్తుంది.  గులాబీ పార్టీలో అసంతృప్త నేతలకు ఆ కమలదళం గాలం వేస్తుంది. ఈ క్రమంలో ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీ గూటికి చేరారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Revanth Reddy: లాగులో తొండలు విడిచి కొడతా కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సెటైర్లు | Asianet News Telugu
Bank Holidays : జనవరి 2026 లో ఏకంగా 16 రోజుల బ్యాంక్ హాలిడేస్... ఏరోజు, ఎందుకు సెలవు?