ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌.. గవర్నర్‌కు సిఫారసు చేయడానికి క్యాబినెట్ నిర్ణయం

By Mahesh K  |  First Published Mar 12, 2024, 7:45 PM IST

రాష్ట్ర క్యాబినెట్ మరోసారి ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్టు అమీర్ అలీ ఖాన్ పేర్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సిఫారసు చేసింది. వీరి పేర్లను గవర్నర్‌కు పంపాలని తీర్మానించింది.
 


తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మరోసారి ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్టు అమీర్ అలీ ఖాన్‌ల పేర్లను మరోసారి సిఫారసు చేయడానికి తీర్మానం చేసింది. గతంలో వీరిద్దరి పేర్లనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు పంపించారు. గవర్నర్ కోటాలో వీరిని ఎమ్మెల్సీలుగా నియమించాలని కోరారు. అందుకు ఆమె అంగీకరించారు. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా ప్రారంభం అయ్యాయి. కానీ, హైకోర్టు ఆదేశాలతో వారి ప్రమాణ స్వీకారం నిలిచిపోయింది.

తొలుత గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవన్, కుర్రా సత్యనారాయణ పేర్లను సిఫారసు చేశారు. కానీ, గవర్నర్ తమిళిసై వారి పేర్లను తిరస్కరించారు. ఇంతలో ప్రభుత్వం మారింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్టు అమీర్ అలీ ఖాన్ పేర్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలని సిఫారసు చేసింది. అందుకు గవర్నర్ తమిళిసై గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Latest Videos

undefined

Also Read: కొత్త రేషన్ కార్డులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్.. కీలక నిర్ణయాలను వెల్లడించిన ప్రభుత్వం

కానీ, దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలు తమ పేర్లను తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై స్టే విధించింది. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించి పంపుతుందని, కాబట్టి, వారి పేర్లను తిరస్కరించే అధికారం గవర్నర్‌కు లేదని పేర్కొంది. మళ్లీ ఫ్రెష్‌గా క్యాబినెట్‌లో చర్చించి సిఫారసులు చేయాలని హైకోర్టు పేర్కొంది.

దీంతో రాష్ట్ర క్యాబినెట్ తాజాగా మరోసారి చర్చింది. మళ్లీ వారిద్దరి పేర్లనే రేవంత్ రెడ్డి క్యాబినెట్ గవర్నర్‌కు సిఫారసు చేసింది.

click me!