కంటి వెలుగు కనిపించడం లేదు.. బస్తీ దవాఖాకు సుస్తి చేసింది : కేసీఆర్‌పై షర్మిల ఫైర్

By Siva KodatiFirst Published Dec 7, 2021, 3:04 PM IST
Highlights

తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల . గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకే వైఎస్ రాజశేఖర్ రెడ్డి 104 సర్వీసులను (104 service in telangana) ప్రవేశపెట్టారని షర్మిల గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు వాటిని బంద్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె మండిపడ్డారు. 

తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (ys sharmila). మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకే వైఎస్ రాజశేఖర్ రెడ్డి 104 సర్వీసులను (104 service in telangana) ప్రవేశపెట్టారని షర్మిల గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు వాటిని బంద్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె మండిపడ్డారు. ఇప్పటిదాకా ప్రారంభించని పల్లె దవాఖానాల (palle dawakhana) కోసం 104 సేవలను ఆపేయాలని కేసీఆర్ సర్కార్ ప్రయత్నిస్తోందని షర్మిల ఆరోపించారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు (kanti velugu) పథకం కనిపించకుండా పోయిందని, బస్తీ దవాఖానాలకు (basti dawakhana) సుస్తీ చేసిందని విమర్శించారు. సర్కార్ దవాఖానాల్లో సౌకర్యాలు కరువయ్యాయని షర్మిల మండిపడ్డారు. పల్లె దవాఖానాలు ప్రారంభం కాకముందే 104 సేవలను బంద్ చేస్తున్నారంటే.. ప్రజల ప్రాణాల మీద కేసీఆర్‌కున్న ప్రేమ ఏపాటిదో అర్థమవుతోందని ఆమె అన్నారు. సౌకర్యాల్లేక, వైద్యం అందక సర్కార్ దవాఖానాల్లో ప్రజలు కరోనాతో చనిపోతున్నారని షర్మిల ఆరోపించారు.

Also read:‘ఇంకెంతమందిని బలి తీసుకుంటే మీ కండ్లు చల్లబడతాయి’... రైతు ఆత్మహత్యలపై కేసీఆర్ పై మండిపడ్డ షర్మిల...

ఇక కొద్దిరోజుల క్రితం ఆమె మాట్లాడుతూ.. వడ్లను రోడ్లమీద కళ్ళల్లో పెట్టుకుని farmers నిరీక్షణ చేస్తున్నారని కేసీఆర్ పై మండిపడ్డారు. ఎప్పుడు కొంటారో తెలియక కుప్పల మీదే రైతుల గుండెలు ఆగిపోతున్నాయని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగి వడ్ల మీద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే 10 మంది రైతుల గుండెలు ఆగిపోయాయి అన్నారు. 

ఇంకెంత మంది రైతులు చస్తే తమ కండ్లు చల్లబడతాయి KCR అని షర్మిల ప్రశ్నించారు. ఇంకెంత మందిని బలితీసుకుంటారని నిలదీశారు. రైతులను కోటీశ్వరులను చేశామని, కార్లలో తిరుగుతున్నారు అని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి అని వ్యాఖ్యానించారు. ఒక్కసారి ఫాంహౌస్ మత్తు నుంచి బయటికి వస్తే తెలుస్తుందని... రైతులు కోటీశ్వరులు కావడం కాదు తమరు ఉరి వేస్తున్నారని అన్నారు. తమరు పంట కొనక రైతులను కాటికి పంపుతున్నారని వైఎస్ షర్మిల కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

click me!