Hyderabad: "కుళ్లు కాయలను బంగారు సంచిలో దాచినా కంపు బయటపడదా ఏంటి.. అలాగే ఉంది.. బీఆర్ఎస్, బీజేపీల అక్రమ మైత్రి. ఎంతదాచినా దాగదులే అన్నట్టు... గల్లీలో సిగపట్లు, ఢిల్లీలో కౌగిలింతలు.. నిజం కాదని నిరూపించగలరా? బీహార్ లో జరిగిన బీజేపీయేతర పక్షాల సమావేశానికి మీకు ఆహ్వానం ఎందుకు అందలేదో చెప్పే దమ్ముందా మీకు?.." అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు.
YS Sharmila lashes out at KCR: వైఎస్సార్టీపీ నాయకురాలు వైఎస్ షర్మిల మరోసారి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్), అధికార పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. దళిత బంధు పథకం పక్కదారి పట్టిందని ఆరోపించిన ఆమె.. అధికార నేతలు, ఎమ్మెల్యేలు పబ్లిక్ గా దోచుకుంటున్నారని అన్నారు. దళితబంధు ఎమ్మెల్యేల బంధులా మారిందనీ, అవినీతికి సంబంధించి సాక్ష్యాధారాలు బయట పెట్టినా..దొర తీసుకున్న చర్యలు శూన్యమంటూ కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు గుప్పించిన వైఎస్ షర్మిల.. దళితబంధు పథకానికి ఎమ్మెల్యేలే రాబందులు అని చెప్పిన దొర (కేసీఆర్)...దొంగలకే మళ్ళీ తాళాలు కట్టబెట్టారని విమర్శించారు. ఎవరెంత తిన్నారో అన్ని లెక్కలు ఉన్నాయని బెదిరించి.. ఎన్నికలకు కావల్సినంత తినండని మళ్ళీ బీఆర్ఎస్ దొంగలకే భాద్యతలు ఇచ్చాడని ఘాటు విమర్శలు చేశారు. దళిత బంధు పథకం ఎంపికకు సంబందించి ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించడాన్ని తప్పుబట్టారు. అర్హుల ఎంపిక భాధ్యత మీ బందిపొట్లకే మరోసారి ఇచ్చి.. దళితబంధు పథకాన్ని కమీషన్ల బంధు అని చెప్పకనే చెప్పారని ఆరోపించారు.
undefined
ఈ పథకంలో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. "నియోజక వర్గానికి 11 వందల మంది అంటే.. ఒక్కో ఎమ్మెల్యే సగం కమీషన్లు తిన్నా 55 కోట్లు.. 100 నియోజక వర్గాల లెక్కలు కడితే 6 వేల కోట్లు.. దళిత బిడ్డల పేరు చెప్పి ఎన్నికల వేళ ఎమ్మెల్యేలకు దొచిపెట్టే కుట్ర ఇది. కమీషన్లు కొట్టండి..ఎన్నికల్లో ఖర్చు పెట్టండి..ఇదే దొర ఎమ్మెల్యేలకు ఇచ్చిన బంపర్ ఆఫర్. పథకం పక్కదారి పట్టిందని, ఎమ్మెల్యేలు పబ్లిక్ గా దోచుకుంటున్నారని" ఆరోపించారు. "దళితబంధు ఎమ్మెల్యేల బంధులా మారిందని.. సాక్ష్యాధారాలు బయట పెట్టినా..దొర తీసుకున్న చర్యలు శూన్యం. కమీషన్ల కహానీ బయట పెడితే..దొర అవినీతిపై ఎమ్మెల్యేలే తిరగబడతరని భయమంటూ" విమర్శించారు.
దళితబంధు ఎంపిక ప్రక్రియలో ఎమ్మెల్యేల భాగస్వామ్యాన్ని వెంటనే రద్దు చేయాలని వైఎఎస్ఆర్ తెలంగాణ పార్టీ మరో సారి డిమాండ్ చేస్తోందని అన్నారు. గ్రామసభలో కలెక్టర్ ఆధ్వర్యంలోనే అర్హుల ఎంపిక జరగాలని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుక బడిన దళిత బిడ్డలకు పూర్తి స్థాయి పరిహారం అందాలేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కమిషన్లు అడిగిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
అలాగే, బీజేపీ, బీఆర్ఎస్ లు ఒక్కటేనని ఆరోపించారు. "కుళ్లు కాయలను బంగారు సంచిలో దాచినా కంపు బయటపడదా ఏంటి.. అలాగే ఉంది.. బీఆర్ఎస్, బీజేపీల అక్రమ మైత్రి. ఎంతదాచినా దాగదులే అన్నట్టు... గల్లీలో సిగపట్లు, ఢిల్లీలో కౌగిలింతలు.. నిజం కాదని నిరూపించగలరా? బీహార్ లో జరిగిన బీజేపీయేతర పక్షాల సమావేశానికి మీకు ఆహ్వానం ఎందుకు అందలేదో చెప్పే దమ్ముందా మీకు?.." అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు.