ఎవడ్రా నీకు మరదలు.. కుక్కకు నీకు తేడా వుందా : మంత్రి నిరంజన్ రెడ్డిపై షర్మిల ఆగ్రహం

By Siva KodatiFirst Published Sep 9, 2022, 8:39 PM IST
Highlights

తనపై మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గట్టిగా కౌంటరిచ్చారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. పరాయి స్త్రీలో తల్లిని, చెల్లిని చూడలేని సంస్కారహీనుడు నిరంజన్ రెడ్డి అని ఆమె ఫైరయ్యారు.

తనపై మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గట్టిగా కౌంటరిచ్చారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. తనను మంగళవారం మరదలన్నాడని.. ఎవడ్రా నువ్వు, నీకు సిగ్గుండాలంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పరాయి స్త్రీలో తల్లిని, చెల్లిని చూడలేని సంస్కారహీనుడు నిరంజన్ రెడ్డి అని ఆమె ఫైరయ్యారు. ఈయనకు కుక్కకు ఏమైనా తేడా వుందా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. అధికార మదం తలకెక్కిందా... నా పోరాటంలో నీకు మరదలు కనిపించిందా అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ఇప్పుడే కాదు.. గతేడాది కూడా నిరంజన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. సంస్కారం లేని కుక్కలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో వున్నాయని... ఆ కుక్కకి తల్లీ, చెల్లి లేరా అని ఆమె ప్రశ్నించారు. కుక్కకి కుక్క బుద్ధులు పోవని.. చంద్రుడిని చూసి కుక్కలు మొరిగితే పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య కొత్తగా మంగళవారం మరదలొకామె బయలుదేరిందంటూ వ్యాఖ్యానించారు. 

ALso Read:మునుగోడులో వైఎస్సార్ టిపి పోటీచేస్తే కేసీఆర్ దొరకు కన్నీళ్లే..: షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు

కాగా.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో తెలంగాణలో వేరు కుంపటి పెట్టుకున్న వైఎస్ షర్మిల.. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు గాను ప్రజా ప్రస్థానం పేరిట ఆమె రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్రను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో షర్మిల పాదయాత్ర కీలక మైలురాయిని చేరుకుంది. ఆగస్ట్ 20 నాటికి 1,700 కిలోమీటర్ల పాదయాత్రను షర్మిల పూర్తి చేసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లో ఆమె ఈ ఘనత అందుకున్నారు. 

ఈ సందర్భంగా వైఎస్సార్‌టీపీ శ్రేణులు ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను షర్మిల సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రజల సహకారంతోనే 1700 కిలోమీటర్ల పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. పాదయాత్రలో తన వెన్నంటి వున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. మాట మీద నిలబడే వైయస్ఆర్ నాయకత్వాన్ని తెలంగాణలో తిరిగి తీసుకొస్తామని..  వైయస్ఆర్ సంక్షేమ పాలన ప్రజలకు చూపిస్తామని షర్మిల వెల్లడించారు.

click me!