సైదాబాద్‌లో మైనర్ బాలికపై రేప్, హత్య: బాధిత కుటుంబానికి షర్మిల పరామర్శ

By narsimha lodeFirst Published Sep 15, 2021, 1:20 PM IST
Highlights

సైదాబాద్ సింగరేణి కాలనీలో అత్యాచారంతో పాటు హత్యకు గురైన మైనర్ బాలిక కుటుంబాన్ని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల బుధవారం నాడు పరామర్శించారు.  బాధిత కుటుంబాన్ని ఆమె ఓదార్చారు.

హైదరాబాద్: సైదాబాద్ సింగరేణి కాలనీలో  అత్యాచారంతో పాటు హత్యకు గురైన మైనర్ బాలిక కుటుంబాన్ని వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం నాడు పరామర్శించారు. సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల మైనర్ బాలికపై అత్యాచారంచేసి  హత్య చేశాడు రాజు అనే నిందితుడు.  

ఈ ఘటన వినాయక పర్వదినం రోజే చోటు చేసుకొంది. మైనర్ బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితుడు రాజు ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు. రాజు ఆచూకీ చెబితే రూ. 10 లక్షల రివార్డు ఇస్తామని హైద్రాబాద్ పోలీసులు మంగళవారం నాడు ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని షర్మిల ఓదార్చారు. 

 ఈ ఘటనపై  కుటుంబసభ్యులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బాధితులపై  లాఠీచార్జీ మృతదేహన్ని పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు.  బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. 8 గంటల  ఆందోళన తర్వాత  స్థానికులు ఆందోళనను విరమించారు.ఆ ఘటన జరిగిన రోజు నుండి  రాజకీయ నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు

 

click me!