రేపు మహబూబాబాద్‌లో వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల టూర్

By narsimha lodeFirst Published Nov 29, 2022, 11:49 AM IST
Highlights

వైఎస్ఆర్‌టీపీ చీఫ్  వైఎస్ షర్మిల  రేపు మహబూబాబాద్  జిల్లాలో  పర్యటించనున్నారు. ఇవాళ  మహబూబాబాద్‌లో  జరగాల్సిన  సభను వాయిదా  వేశారు. 

హైదరాబాద్: రేపు యధావిధిగా  మహబూబాద్  జిల్లాలో  వైఎస్ఆర్‌టీపీ  చీఫ్  వైఎస్  షర్మిల  పర్యటించనున్నారు. నర్సంపేట  నియోజకవర్గంలోని లింగగిరి  వద్ద  ఈ  నెల 28న  షర్మిలన పోలీసులు అరెస్ట్  చేసి  హైద్రాబాద్ కు తరలించారు. హైద్రాబాద్ లోని  నివాసంలోనే  వైఎష్  షర్మిల  ఉన్నారు. ఇవాళ  మహబూబాబాద్ లో  జరగాల్సిన  సభను వాయిదా  వేశారు. రేపు యధావిధిగా  మహబూబాబాద్  జిల్లాలో  షర్మిల  పర్యటించనున్నారు.

నర్సంపేట  నియోజకవర్గంలో  వైఎస్  షర్మిల పాదయాత్ర 3500 కి.మీ.లకు చేరింది. దీంతో  ఈ నెల  27న పైలాన్ ను  ఆవిష్కరించారు.ఈ సందర్భంగా  నిర్వహించిన  సభలో  వైఎస్  విజయమ్మ కూడా పాల్గొన్నారు.ఈ సభలో  వైఎస్  షర్మిల నర్సంపేట  ఎమ్మెల్యే  పెద్ది సుదర్శన్  రెడ్డిపై తీవ్ర స్థాయిలో  విమర్శలు గుప్పించారు.

పెద్దిసుదర్శన్ రెడ్డి  పెద్ద అవినీతిపరుడిగా  పేర్కొన్నారు.ఎమ్మెల్యే  కాకముందు  ప్రస్తుతం  సుదర్శన్ రెడ్డి  ఆస్తులు తెలపాలని  కోరింది.ఈ  వ్యాఖ్యలపై  క్షమాపణ చెప్పాలని  టీఆర్ఎస్  శ్రేణులు  షర్మిలను డిమాండ్  చేశారు. అయితే  క్షమాపణ  చెప్పకుండా  షర్మిల  పాదయాత్రను కొనసాగించారు. దీంతో  టీఆర్ఎస్  శ్రేణులు నిన్న  లింగగిరిలో  వైఎస్  షర్మిల  బస  చేసే బస్సుకు నిప్పంటించారు. ఈ  మంటలను  వైఎస్‌ఆర్‌టీపీ శ్రేణులు  ఆర్పివేశారు.ఈ సమయంలో  టీఆర్ఎస్  శ్రేణులను  వైఎస్ఆర్‌టీపీ  శ్రేణుల మధ్య  వాగ్వాదం చోటు  చేసుకుంది.  

also read:నర్సంపేటలో వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అరెస్ట్

ఆ తర్వాత వైఎస్  షర్మిలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు  వచ్చిన సమయంలో  పోలీసులతో  వైఎస్ఆర్‌టీపీ  శ్రేణులు  వాగ్వాదానికి  దిగారు. షర్మిలను అరెస్ట్  చేసి పోలీసులు వాహనంలో  తరలిస్తున్న సమయంలో పోలీస్ వాహనం  ముందు  బైఠాయించి నిరసనకు దిగారు. వైఎస్ఆర్‌టీపీ శ్రేణులను  చెదరగొట్టి  షర్మిలను పోలీసులు హైద్రాబాద్ కు తరలించారు. తమ బస్సుకు నిప్పటించిన నిందితులను  ఎందుకు  అరెస్ట్  చేయలేదో  చెప్పాలని  వైఎస్  షర్మిల  ప్రశ్నించారు. బాధితులపైనే పోలీసులు  చర్యలు తీసుకోవడాన్ని ఆమె  తప్పుబట్టారు.
 

click me!