ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదుకు హైకోర్టులో బీజేపీ ఎంపీ అరవింద్ పిటిషన్

By narsimha lode  |  First Published Nov 29, 2022, 11:21 AM IST

తనను దూషించి తన  ఇంటిపై  దాడి  చేసిన  ఎమ్మెల్సీ  కవితపై  కేసు నమోదు  చేసేలా  ఆదేశాలివ్వాలని కోరుతూ బీజేపీ ఎంపీ  ధర్మపురి  అరవింద్  హైకోర్టులో  పిటిషన్  దాఖలు  చేశారు. 


హైదరాబాద్: టీఆర్ఎస్  ఎమ్మెల్సీ  కవితపై  కేసు నమోదు చేసేలా  ఆదేశాలివ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో  బీజేపీ  ఎంపీ  ధర్మపురి  అరవింద్  పిటిషన్  దాఖలు  చేశారు. ఇవాళ  ఈ పిటిషన్ పై  తెలంగాణ హైకోర్టు విచారణ  చేయనుంది. ఈ నెల  18న టీఆర్ఎస్  శ్రేణులు  హైద్రాబాద్  ఎమ్మెల్యే కాలనీలోని  నిజామాబాద్  ఎంపీ  ధర్మపురి  అరవింద్  నివాసంపై దాడి  చేశారు.ఈ దాడిలో  అరవింద్  నివాసంలో  ఫర్నీచర్ ను ధ్వంసం  చేశారు. అంతేకాదు  అరవింద్  నివాసంలో  ఉన్న కారు అద్దాలను  ధ్వంసం  చేశారు. ఈ  ఘటనకు సంబంధించి  ధర్మపురి  అరవింద్  కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ  కేసులో  ఇప్పటికే పలువురిని  పోలీసులు  అరెస్ట్  చేశారు. 

ఈ నెల  17న ఎమ్మెల్సీ కవితపై నిజామాబాద్  ఎంపీ  అరవింద్  కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్  పార్టీ చీఫ్ మల్లికార్జునఖర్గేకి  కవిత  ఫోన్ చేశారన్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు  ఖర్గేతో  ఆమె మాట్లాడారని  ఎఐసీసీ  సెక్రటరీ తనకు చెప్పారని  ధర్మపురి అరవింద్  మీడియా సమావేశంలో  వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. అరవింద్  నివాసంపై  దాడికి దిగారు. ఈ దాడి జరిగిన  తర్వాత  హైద్రాబాద్ లోని మీడియా సమావేశం  ఏర్పాటు  చేసిన  కవిత  నిజామాబాద్  ఎంపీ ధర్మపురి  అరవింద్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై తప్పుడు  ప్రచారం చేస్తే  నిజామాబాద్ చౌరస్తాలో  చెప్పుతో కొడతానన్నారు. అరవింద్  ఎక్కడి నుండి పోటీ  చేసినా  తాను  అరవింద్ ను ఓడిస్తానని  వార్నింగ్  ఇచ్చారు.

Latest Videos

also read:బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి ఘటన.. రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు ఏం చెప్పారంటే..?

తన  ఇంటిపై దాడికి సంబంధించి  నిజామాబాద్  ఎంపీ  ధర్మపురి అరవింద్  కూడా  సీరియస్  గా  స్పందించారు. కవితను  బీజేపీలో చేరాలని ఒత్తిడి  వచ్చిందని  కేసీఆర్ స్వయంగా  చెప్పారన్నారు.ఈ  విషయం చెప్పిన  కేసీఆర్ ను కూడా  కొడతావా  అని  కవితను  అరవింద్  ప్రశ్నించారు.తనపై పోటీ చేయాలని కవితకు  అరవింద్  సవాల్  విసిరారు.  తాను వచ్చే  ఎన్నికల్లో  నిజామాబాద్  నుండే పోటీ చేస్తానని  ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్  శ్రేణుల దాడిలో  ధ్వంసమైన  ధర్మపురి  అరవింద్  ఇంటిని  పలువురు  బీజేపీ  నేతలు  పరిశీలించారు. ఈ ఘటనకు పాల్పడిన  నిందితులను  కఠినంగా శిక్షించాలని  డిమాండ్  చేసిన విషయం  తెలిసిందే. 


 

click me!