Ys Sharmila: ముందు ఇంట గెలిచి రచ్చ గెలవండి దొరా...కేసీఆర్‌ పై షర్మిల ఫైర్‌

By Rajesh KFirst Published Jan 12, 2022, 5:13 PM IST
Highlights

Ys Sharmila: సీఎం కేసీఆర్ పై వైఎస్సార్‌టీపీ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో రైతులు చనిపోతున్న కేసీఆర్ సర్కార్‌కు పట్టడం లేదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇటీవ‌ల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బ్యాంకు రుణం చెల్లించలేక రైతు ఆత్మహత్య విష‌యంపై  ముఖ్యమంత్రి కేసీఆర్‌ను  తీవ్రస్థాయిలో విమ‌ర్శించింది.
 

Ys Sharmila: అధికార టీఆర్‌ఎస్,సీఎం కేసీఆర్ పై వైఎస్సార్‌టీపీ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఘాటుగా స్పందించారు.  రైతులు చనిపోతున్న కేసీఆర్ సర్కార్‌కు పట్టడం లేదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇటీవ‌ల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బ్యాంకు రుణం చెల్లించలేక రైతు ఆత్మహత్య చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై  వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇతర రాష్ట్రాల నేతలతో కలిసేందుకు సీఎం కేసీఆర్‌కి సమయం ఉంటుంది కానీ చనిపోతున్న రైతులను కాపాడుకోలేని సోయి లేదని ఆమె మండిపడ్డారు. ముందు ఇంట గెలిచిన తర్వాత రచ్చ గెలవండంటూ హితవు పలికారు.

ఈ మేరకు త‌న ట్విట్టర్‌లో ^ ఇంట గెలిచిన తరువాత రచ్చ గెలవండి దొరా.. మీకు తమిళనాడు ముఖ్యమంత్రితో మాటామంతికి, కేరళ CM తో మంతనాలు చేయడానికి, బీహార్ ప్రతిపక్ష నేతను కలసి దోస్తానా చేయడానికి, దేశ రాజకీయాల మీద చర్చ చేయడానికి సమయం ఉంది తప్ప.. చనిపోతున్న రైతులను ఆదుకోవాలనే సోయి లేదు.’ అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీ రైతుబంధు వారోత్సవాల సాక్షిగా బ్యాంకుల ఆగడాలకు రైతులు బలైపోతున్నది. మీకు కనపడుతుందా దొరా? పంట నష్టపోయి ఆత్మహత్య చేసుకొనే రైతులు మీకు కనపడరు. వడ్డీ వ్యాపారుల చేతుల్లో నష్టపోయిన రైతులు మీకు కనపడరు. రుణాలు చెల్లించలేక ప్రాణాలు తీసుకొనే రైతులు మీకు కనపడరు. ముందు ఇక్కడి రైతుల చావులను ఆపి తరువాత దేశాన్ని ఏలపోండి.’ అంటూ షర్మిల ట్విట్టర్‌ వేదికగా కేసీఆర్‌ సర్కార్‌పై ధ్వజమెత్తారు.

ఇదిలా ఉంటే..  వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఆశ‌యాల సాధ‌న కోసం తెలంగాణ‌లో  వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (YSRTP) అనే కొత్త పార్టీని స్థాపించింది. అయితే..  వైఎస్ ష‌ర్మిల‌కు (YS Sharmila) ఎదురు దెబ్బ త‌గిలింది. పార్టీ పేరుకు రిజిస్ట్రేష‌న్ చిక్కులు వ‌చ్చి ప‌డ్డాయి. వైఎస్ఆర్‌టీపీ పేరుతో రిజిస్ట్రేష‌న్‌కు చేసుకున్న పార్టీకి అభ్యంత‌రాలు వ‌చ్చాయ‌ని  ఈసీ తెలిపింది. ఇప్ప‌టికే  తెలంగాణ‌లో .. అన్న వైఎస్ఆర్ పేరుతో పార్టీ ఏర్పాటు చేసినా వారు.. త‌మ పార్టీని పోలి ఉందంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదును స్వీక‌రించినా.. ఎన్నిక‌ల సంఘం.. వైఎస్ఆర్‌టీపీ గుర్తింపుపై ప‌రిశీలిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో ఈ విష‌య‌మై జన‌వ‌రి 3న ఎన్నిక‌ల్ క‌మిష‌న్ వైఎస్ఆర్‌టీపీకి లేఖ రాసింది. మ‌రి ఈ వివాదం ఎలాంటి మ‌లుపులు తిరుగుతుందో చూడాలి.ఇప్ప‌టికే  ష‌ర్మిల‌.. తెలంగాణ‌లో ప‌లు ప్ర‌జా స‌మ‌స్య‌లై త‌నదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు ర‌కాల దీక్ష‌ల పేరుతో ప్ర‌జ‌ల్లోకి వెళుతున్నారు.

click me!