సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ ఆఫీస్‌లో అగ్ని ప్రమాదం: లిఫ్ట్‌లో చిక్కుకొన్న పలువురు

Published : Jan 12, 2022, 03:18 PM ISTUpdated : Jan 12, 2022, 04:00 PM IST
సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ ఆఫీస్‌లో అగ్ని ప్రమాదం: లిఫ్ట్‌లో చిక్కుకొన్న పలువురు

సారాంశం

సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో  బుధవారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ సమయంలో  లిఫ్ట్ లో పలువురు ఇరుక్కొన్నారు. మంటలను ఆర్పేందుకు  ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

హైదరాబాద్: సికింద్రాబాద్‌ని Ghmc కార్యాలయంలో బుధవారం నాడు మధ్యాహ్నం Fire accidentచోటు చేసుకొంది. జీహెచ్ఎంసీ మూడో అంతస్తులో అగ్ని ప్రమాదం వాటిల్లింది. ఈ సమయంలో పలువురు liftలో  చిక్కుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే  అగ్ని మాపక సిబ్బంది జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు

ఒక్కసారిగా కార్యాలయంలో మంటలు వ్యాపించడంతో పనిచేస్తున్న ఉద్యోగులు భయంతో కార్యాలయం నుండి భయంతో పరుగులు తీశారు. ఈ మంటల కారణంగా పెద్ద ఎత్తున పొగ కమ్ముకుంది. అగ్ని ప్రమాదం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అదే సమయంలో లిఫ్ట్‌లో వెళ్తున్న పలువురు లిఫ్ట్‌లోనే చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు అగ్ని మాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై కూడ అధికారులు ఆరా తీస్తున్నారు.

2018 ఫిబ్రవరిలో ఖైరతాబాద్ లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. కార్యాలయంలోని మొదటి అంతస్థులో తెల్లవారుజామున ఆరు గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. గంట వ్యవధిలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఫైల్స్, కంప్యూటర్లు దగ్ధమయ్యాయి.

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్