కారణమిదీ: వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్

Published : Aug 18, 2023, 09:55 AM ISTUpdated : Aug 18, 2023, 10:02 AM IST
కారణమిదీ:  వైఎస్ షర్మిల  హౌస్ అరెస్ట్

సారాంశం

వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను  పోలీసులు హౌస్ అరెస్ట్  చేశారు.

హైదరాబాద్: వైఎస్ఆర్‌‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను శుక్రవారంనాడు  పోలీసులు హౌస్ అరెస్ట్  చేశారు. ఇవాళ గజ్వేల్ పర్యటనకు  వెళ్తానని షర్మిల ప్రకటించారు. దరిమిలా  పోలీసులు ఆమెను  హౌస్ అరెస్ట్  చేశారు.దళిత బంధు పథకంలో  అక్రమాలు జరిగాయనే   ఆరోపణల విషయమై  తనకు  స్థానికుల నుండి ఆహ్వానం రావడంతో గజ్వేల్ టూర్ కు  వెళ్లనున్నట్టుగా వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నిన్న ప్రకటించారు.గజ్వేల్ నియోజకవర్గంలోని  తీగుల్ గ్రామస్తులు షర్మిలకు  ఈ మేరకు  వినతి పత్రం పంపారు. దీంతో  తీగుల్ గ్రామానికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే  షర్మిల  గజ్వేల్ టూర్ నేపథ్యంలో  పోలీసలు ఆమెను హౌస్ అరెస్ట్  చేశారు.

ఇదిలా ఉంటే  షర్మిల గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటిస్తే అడ్డుకుంటామని  స్థానిక బీఆర్ఎస్ నేతలు  ప్రకటించారు.   తీగుల్ గ్రామంలో దళితబంధు పథకంలో అక్రమాలు  చోటు చేసుకున్నాయని స్థానికుల నుండి  వినతి మేరకు  తాను  తీగుల్ కు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నానని  షర్మిల పోలీసులకు సమాచారం పంపారు.  తన టూర్ కు సంబంధించి బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటారని  వార్నింగ్ ఇవ్వడంతో  షర్మిల పోలీసులకు సమాచారం పంపారు. తన టూర్ కు భద్రత కల్పించాలని  కోరారు.
వైఎస్ షర్మిల  గజ్వేల్ పర్యటిస్తే  ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని పోలీసులు భావించారు.  దీంతో  హైద్రాబాద్  లోటస్ పాండ్ లోనే ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి