వైఎస్ షర్మిల అరెస్ట్... పీఎస్‌కు తరలింపు, టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Siva Kodati |  
Published : Feb 15, 2022, 03:00 PM IST
వైఎస్ షర్మిల అరెస్ట్... పీఎస్‌కు తరలింపు, టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

సారాంశం

ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ.. హైదరాబాద్‌ నాంపల్లిలో టీఎస్​పీఎస్సీ కార్యాలయం (tspsc) వద్ద షర్మిల మంగళవారం ధర్నాకు దిగారు.  ఈ ఆందోళన కారణంగా దాదాపు గంట సేపు ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం కలగడంతో పోలీసులు షర్మిల సహా ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు.

వైఎస్సార్ తెలంగాణ పార్టీ (ysr telangana party) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను (ys sharmila) పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ.. హైదరాబాద్‌ నాంపల్లిలో టీఎస్​పీఎస్సీ కార్యాలయం (tspsc) వద్ద షర్మిల మంగళవారం ధర్నాకు దిగారు. పార్టీ శ్రేణులతో కలిసి బైఠాయించి... ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున వచ్చిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు... ముఖ్యమంత్రి కేసీఆర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళన కారణంగా దాదాపు గంట సేపు ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం కలగడంతో పోలీసులు షర్మిల సహా ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు.

అంతకుముందు షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం దుర్మార్గమని ఆమె ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. అనంతరం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ బి జనార్దన్ రెడ్డికి షర్మిల వినతి పత్రం అందజేశారు. 

కేసీఆర్ (KCR) ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్ తెలంగాణ అధినేత్రి వైఎస్ షర్మిల సోమవారం స్పందించారు. ట్విట్టర్ వేదికన రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగ సమస్యలను ప్రస్తావిస్తూ కేసీఆర్ కు చురకలు అంటించారు.

''ఢిల్లీ కోటలు బద్దలు కొట్టుడు కాదు. ముందు రాష్ట్రంలో ఆగమైతున్న రైతులను నిలబెట్టు. రోజుకిద్దరుగా ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను ఆదుకో. మోడీని దేశం నుంచి తరుముడు ఏమో గానీ...నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు మిమ్మల్ని రాష్ట్రం నుంచి తరమకుండా చూస్కో'' అంటూ షర్మిల కేసీఆర్ ను హెచ్చరించారు. 

''మీరు పులి బిడ్డయితే మొన్న మీ మెడమీద లేని కత్తిని చూసి వడ్లు కొననని ఎట్లా రాసిచ్చారు దొరగారు?  నిన్నటిదాకా కేంద్రానికి వంతపాడి ఈరోజు ఉడుతఊపుల పంచాయితీ పెట్టినవా? రాష్ట్రంలోని సమస్యలనే పరిష్కరించడం చేతకాని మీరు దేశ రాజకీయాలు చేస్తారా? గాలిలో మేడలు. పగటి కలలు. ఓట్ల కోసం తిప్పలు'' అంటూ సీఎం కేసీఆర్ ను ఎద్దేవా చేస్తూ షర్మిల ట్వీట్ చేసారు.

''మిర్చి పంటకు తామర తెగులు సోకి పంట నష్టపోతే, కాస్తోకూస్తో వస్తుంది అనుకున్న పంట అకాల వర్షాలకు మొత్తం కొట్టుకుపోతే,రాష్ట్రంలో 1.44 లక్షల ఎకరాల్లో ఎకరాకు లక్ష 25 వేల పెట్టుబడి పెట్టి రైతులు నష్టపోతే, తెచ్చిన అప్పులను తీర్చలేక మిర్చి రైతులు రోజుకు ఇద్దరు ఆత్మహత్యలు చేసుకొంటుంటే తూతూమంత్రంగా పరామర్శించామా, ఒదిలేశామా అన్నట్టే ఉంది రైతులపై KCR గారి ప్రేమ, కానీ నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలనే సోయి లేదు. ఇక మీరు ఆదుకోరని 20 మందికి పైగా మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. మరొక రైతు చనిపోకముందే ఎకరాకు 50 వేల నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం'' అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు