కేసీఆర్ అమర జవాన్ల ఆత్మలు ఘోషించేలా మాట్లాడారు.. కిషన్ రెడ్డి ఫైర్

Published : Feb 15, 2022, 12:57 PM IST
కేసీఆర్ అమర జవాన్ల ఆత్మలు ఘోషించేలా మాట్లాడారు.. కిషన్ రెడ్డి ఫైర్

సారాంశం

హుజురాబాద్ ఎన్నికలో బీజేపీ తరఫున ఈటల రాజేందర్ విజయం సాధించడంతో టీఆర్‌ఎస్‌లో ప్రకంపనలు మొదలయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. ఎవరు వ్యతిరేకించినా కేసీఆర్ కుటుంబం సహించడం లేదన్నారు. 

హుజురాబాద్ ఎన్నికలో బీజేపీ తరఫున ఈటల రాజేందర్ విజయం సాధించడంతో టీఆర్‌ఎస్‌లో ప్రకంపనలు మొదలయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. ఎవరు వ్యతిరేకించినా కేసీఆర్ కుటుంబం సహించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఎవరూ మాట్లాడొద్దంట ఎలా అని ప్రశ్నించారు. KCR వ్యవహరిస్తున్న తీరు, ఆయన భాష అభ్యంతరకరంగా ఉందని మండిపడ్డారు. సీఎం పదవి గౌరవాన్ని దిగజార్చేలా కేసీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు  తనను ప్రశ్నించే వారు ఎవరూ ఉండొద్దని కేసీఆర్ భావిస్తున్నారని మండిపడ్డారు. బెదిరింపులు, రెచ్చగొట్టే విధానాలకే కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సమైక్యత, సమగ్రతను దెబ్బతీసేలా కేసీఆర్ మాట్లాడరని విమర్శించారు. నిజాం తరహా పాలన మళ్లీ రావాలని కేసీఆర్ కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీ కావాలనే విష ప్రచారం చేస్తున్నారు. అబద్దాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశంపై పాకిస్తాన్ కూడా ఇలాంటి వ్యాఖ్యాలు చేయలేదన్నారు. భారత జవాన్ల దాడిలో తమ స్థావరాలు దెబ్బతిన్నాయని పాక్ ఉగ్రవాదులు కూడా వెల్లడించారని చెప్పారు. ‘పాక్ గగనతలంలోకి విమానాలు రాకుండా నిషేధించారు, ప్రపంచ దేశాలు కూడా అంగీకరించాయి, ఉగ్రవాద సంస్థలు కూడా ఒప్పుకున్నాయి, అనేక వీడియోలు కూడా బయటకు వచ్చాయి’ అని కిషన్ రెడ్డి తెలిపారు. కానీ కేసీఆర్ అసందర్భంగా ఆ విషయాన్ని బయటకు తీసి భారత సైన్యం ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా, అవమానించే విధంగా వ్యవహరించారని విమర్శించారు. అమర జవాన్ల ఆత్మలు ఘోషించేలా కేసీఆర్ మాట్లాడారని అన్నారు.

కేంద్రానికి ఎవరు శత్రువులు కాదని, రాజకీయ ప్రత్యర్థులు మాత్రమేనని కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీకి, దేశానికి ఉన్న ఏకైక శత్రువు పాక్ మాత్రమేనని అన్నారు. 
ప్రత్యర్థి పార్టీల వారిని శత్రువులుగా చూడొద్దని హితవు పలికారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు