అన్నకు ఇబ్బంది రావొద్దనే తెలంగాణలో షర్మిల పార్టీ:వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీలో విజయమ్మ

By narsimha lode  |  First Published Jul 8, 2022, 1:58 PM IST


తన అన్నకు ఎలాంటి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశ్యంతో వైఎస్ షర్మిల తెలంగాణలో  పార్టీని ఏర్పాటు చేసిందని వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీలో వైఎస్ విజయమ్మ చెప్పారు. రెండు రాష్ట్రాల్లో  వైఎస్ఆర్ అంటే అభిమానించే వాళ్లున్నారన్నారు. తెలంగాణ కోడలిగా షర్మిల పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుందన్నారు. 


హైదరాబాద్: తన అన్నకు ఎలాంటి ఇబ్బంది  రాకూడదనే ఉద్దేశ్యంతోనే YS Sharmila తెలంగాణలో వైఎస్ఆర్‌టీపీని ఏర్పాటు చేసుకుందని  YS Vijayamma చెప్పారు. గుంటూరులో శుక్రవారం నాడు జరిగిన ySRCP  Plenary లో ఆమె ప్రసంగించారు. తన జీవితానికి కూడా ఓ సార్ధకత ఉండాలనే లక్ష్యంతో వైఎస్ షర్మిల Telangana లో పార్టీని ఏర్పాటు చేసిందన్నారు. తల్లిగా ఇద్దరి భవిష్యత్తు బాగుండాలని తాను కోరుకుంటున్నట్టుగా చెప్పారు.  

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  YS Jagan  జైల్లో ఉన్న సమయంలో వచ్చిన ఉప ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేసేందుకు తాను వైఎస్ షర్మిల ప్రచారం చేసిన విషయాన్ని ఆమె గుర్తు చశారు.ఈ సమయంలో తమకు ప్రజలు అండగా నిలిచారన్నారు. ప్రజల కోరిక మేరకు వైఎస్ షర్మిల జగన్ వదిలిన బాణంగా పాదయాత్ర నిర్వహించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.  వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రారంభించే సమయంలో తాను భయపడినట్టుగా చెప్పారు. ఒక్క బిడ్డ  జైల్లో ఉంటే ఒక్క ఆడబిడ్డ రోడ్డుపైకి వస్తుందంటే బాధ వేసిందన్నారు. కానీ ఆ సమయంలో షర్మిలను మీరంతా గుండెల్లో పెట్టుకున్నారని ఆమె చెప్పారు. 

Latest Videos

undefined

తమ కుటుంబం గొప్ప కుటుంబం, అభిమానం గల కుటుంబం, మా అనుబంధాలు కూడా గొప్పవి, సంస్కారాలు కూడా గొప్పవనే విసయానని ఆమె ప్రస్తావించారు. తెలంగాణ కోడలిగా తెలంగాణలో షర్మిల వైఎస్ఆర్‌టీపీనీ ఏర్పాటు చేసిందన్నారు.తన తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకు, తన తండ్రిని ప్రేమించే జనానికి నిజాయితీగా సేవ చేసేందుకు ఈ పార్టీని ఏర్పాటు చేసుకొందని  చెప్పారు. తన జన్మకు కూడా సార్ధకత ఉండాలనే ఉద్దేశ్యంతోనే షర్మిల తెలంగాణలో గట్టిగా ప్రయత్నం చేస్తుందని చెప్పారు.  షర్మిలకు తాను అండగా, తోడుగా ఉండాల్సిన అవసరం ఉందని విజయమ్మ తేల్చి చెప్పారు.

also read:అమ్మ రాజీనామా... వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా

వైఎస్ఆర్‌సీపీకి, తెలంగాణలో షర్మిల పార్టీకి మద్దతు పలికే విషయంలో తనపై విమర్శలు వచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. రెండు పార్టీల్లో సభ్యత్వాలు ఉండొచ్చా అనే చర్చ కూడా సాగిందన్నారు. ఈ విషయమై ఎల్లో మీడియాలో గొప్ప గొప్పగా రాశారు, గొప్పగా మాట్లాడారని ఆమె వ్యంగ్యంగా మాట్లాడారు.ఈ రకమైన మీడియా ఉండడం దురదృష్టంగా ఆమె పేర్కొన్నారు.

తల్లిగా ఈ విమర్శలను తాను ఖాతరు చేయలేదన్నారు. ఇద్దరికి చేతనైనా సహాయం చేసినట్టుగా చెప్పారు. ఇంత వరకు జరిగింది ఒక ఎత్తు , ఇక జరగబోయేది మరో ఎత్తుగా ఆమె పేర్కొన్నారు. రాజకీయ ఎన్నికల యుద్ధం రానుందన్నారు. తెలంంగాణలో ఏపీ కంటే ముందుగానే ఎన్నికలు వస్తాయన్నారు. తెలంగాణలో వైఎస్ షర్మిల తెలంగాణ ప్రయోజనాల గురించి  మాట్లాడుతుందన్నారు. ఏపీ సీఎంగా జగన్ ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తాయని ఆమె చెప్పారు.  ఏపీ ప్రజలకు అండగా నిలబాల్సిన అవసరం జగన్ కు ఉంటుందన్నారు. షర్మిలకు, జగన్ కు వేర్వేరు విధానాలు ఉండక తప్పిని అనివార్య పరిస్థితులున్నాయని విజయమ్మ చెప్పారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హావభావాలు, ఆప్యాయతలను ఇద్దరూ పుణికిపుచ్చుకున్నారని చెప్పారు. కానీ వేర్వేరు రాష్ట్రాల్లో పార్టీల ప్రతినిధులుగా పనిచేస్తున్నారన్నారు.వేర్వేరు ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని తనతో పాటు మీరు కూడా ఏనాడు ఊహించి ఉండబోరన్నారు. ఎందుకు జరుగుతుందో తనకు తెలియదన్నారు. కానీ దేవుడు అందరికీ మంచి చేయాలనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తున్నాడేమోనని తాను అనుకుంటున్నానన్నారు. 

ఈ కారణంగానే తాను షర్మిలకు అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ఆమె చెప్పారు. జగన్ కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉన్నానన్నారు. షర్మిల కష్టాల్లో ఉన్న సమయంలో  ఆమెకు అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. 
 

click me!