
హైదరాబాద్ : త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా స్పందించారు. ఒక తెలుగు పాటకు ఆస్కాడ్ అవార్డు లభించడం మర్చిపోలేని మధుర జ్ఞాపకం అని అన్నారు. ఆస్కార్ విశ్వ వేదికపై తొలిసారిగా భారతీయ సినిమా పాటకు అది తెలుగు సినిమా పాటకు ఆస్కార్ అవార్డు రావడం.. ప్రపంచంలోనే తెలుగు వారందరికీ ముఖ్యంగా భారతీయులందరికీ గర్వకారణం అని అన్నారు.
ఇంత గొప్ప పాటను రాసినందుకు పాటల రచయిత చంద్రబోస్.. మ్యూజిక్ అందించిన ఎంఎం కీరవాణి లకు… పాటకు తమ గలాన్ని అందించి ఉర్రూతలూపిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలతో పాటు.. ఆర్ఆర్ సినిమా చిత్ర యూనిట్ కు బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి చేర్చిన ఘనత దర్శకుడు రాజమౌళి, నటులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లదని వారికి ప్రత్యేక శుభాకాంక్షలు అంటూ బండి సంజయ్ తెలియజేశారు.
తెలుగు సినీ ప్రేక్షకులకు ఇది పండగ రోజు.. ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌కు కేసీఆర్, కేటీఆర్‌ల అభినందనలు..
95వ ఆస్కార్ వేడుక లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ వేదికగా జరిగింది. ఈ వేడుకలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వరించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట ఉత్తమ పాటగా అకాడమీ అవార్డును సొంతం చేసుకుంది. అంతర్జాతీయ వేదికపై ఈ అవార్డుతో తన సత్తా చాటింది.
కాగా, 95వ అకాడమీ అవార్డ్స్‌లో తెలుగు పాట నాటు నాటు సంచలనం సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆర్‌ఆర్‌ఆర్ లోని పాట ఆస్కార్ గెలుచుకుని.. భారతదేశం మరోసారి గర్వపడేలా చేసింది. ఈ సంతోష సందర్భంగా రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని అవార్డు వేడుక వేదిక దగ్గర్నుండి కొన్ని ఫొటోలో తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేశారు.
ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో, ఉపాసన ఫాలోవర్స్ కు ఆస్కార్ వేడుకలోని ముఖ్యమైన ఘట్టాలను ఫొటోల రూపంలో షేర్ చేశారు. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, అతని భార్య రమా రాజమౌళి.. రామ్ చరణ్.. మిగతావారితో చాలా ఫోటోలు తీసుకున్నారు. ఈ ఫొటోలలో త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న రామ్ చరణ్, ఉపాసన సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. ఈ ఫొటోలో త్రిపుల్ ఆర్ స్టార్ రామ్ చరణ్ నలుపురంగు సంప్రదాయ దుస్తుల్లో, ఉపాసన స్టేట్‌మెంట్ జ్యువెలరీతో జత చేసిన వైట్ క్రీమ్ చీరలో అందంగా కనిపిస్తుంది.
ఇక రాజమౌళి ధోతీ కుర్తా సెట్‌లో ఎప్పటిలాగే చిరునవ్వుతో సాంప్రదాయకంగా ఉన్నారు. అతని భార్య రమా రాజమౌళి గులాబీ రంగు చీరలో కనిపిస్తున్నారు. వీరు నలుగురు కలిసి దిగిన ఫొటోను ఉపాసన షేర్ చేస్తూ... దీనికి క్యాప్షన్‌గా ఇలా పేర్కొంది : "ఆస్కార్ ప్రేమ. ధన్యవాదాలు రాజమౌళి గారూ..కుటుంబసమేతంగా ఆస్కార్ వేదిక మీద ఉన్నాం. జై హింద్’ అంటూ పోస్ట్ షేర్ చేశారు. ఆర్ఆర్ఆర్ పాటలోని వైరల్ ట్రాక్ నాటు నాటు ఆస్కార్స్‌లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డు గెలుచుకుంది.