YS Sharmila: వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరహార దీక్ష వాయిదా.. కారణమిదే..

By team teluguFirst Published Nov 15, 2021, 4:48 PM IST
Highlights

తెలంగాణలోని వివిధ శాఖల్లో లక్షా 91 వేలకు పైగా ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSR Telangana Party) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) నిరుద్యోగ నిరహార దీక్షను (Nirudyoga nirahara deeksha) చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ దీక్షను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి.


తెలంగాణలోని వివిధ శాఖల్లో లక్షా 91 వేలకు పైగా ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSR Telangana Party) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) నిరుద్యోగ నిరహార దీక్షను (Nirudyoga nirahara deeksha) చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రతి మంగళవారం ఆమె నిరుద్యోగ నిరహార దీక్షను కొనసాగిస్తూ వస్తున్నారు. ఓ వైపు  ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను కొనసాగిస్తున్న షర్మిల.. యాత్రలో కూడా ఈ దీక్షను కొనసాగిసతున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంతో షర్మిల పాదయాత్రకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. 

ఈ క్రమంలోనే రేపటి మంగళవారం జరగబోయే నిరుద్యోగ నిరహా దీక్షను తాత్కాలికంగా వాయిదా వేసినట్టుగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశాయి. పోలీసుల అనుమతి లేనందునే వాయిదా వేస్తున్నట్టుగా వైఎస్సార్‌టీపీ వర్గాలు వెల్లడించాయి. కోడ్ ముగిసిన వెంటనే నిరుద్యోగ నిరహార దీక్ష, రైతు వేదన దీక్ష, ప్రజా ప్రస్థానం ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 

Also read: కేసీఆర్ వడ్లు కొనకుంటే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం.. రైతు వేదన దీక్షలో వైఎస్ షర్మిల వార్నింగ్

‘ఎన్నికలున్న ప్రతిసారీ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇస్తున్నారే తప్ప అమలు చేయడం లేదు. నిరుద్యోగులు వయసు పైబడటం, కుటుంబానికి భారం కాలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నా సర్కారు స్పందించడం లేదు. మొన్నవారంలో ఇద్దరు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. నిరుద్యోగుల దీక్షను ఆదిలో ఆపాలని చూసిన ప్రభుత్వ కుట్రలు ఏ మాత్రం సాగలేదు. ప్రతి మంగళవారం నిరంతరాయంగా  వైఎస్ షర్మిల దీక్ష చేస్తున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కొన్ని ప్రాంతాల్లోనే అమలులో ఉన్నా పోలీసులు మాత్రం ఎక్కడా పర్మిషన్ ఇవ్వడం లేదు. పోలీసుల వైఖరి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా నడుస్తోంది. మొన్న రైతు వేదన దీక్షను అడ్డుకున్న పోలీసులు.. ఇప్పుడు నిరుద్యోగ దీక్షకు అనుమతి ఇవ్వడం లేదు. ఇలా ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కై ఉద్యమాలను అణచివేయాలని చూస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే తిరిగి నిరుద్యోగ దీక్ష, రైతు వేదన దీక్ష, ప్రజా ప్రస్థానం ప్రారంభమవుతాయి’ అని వైఎస్సార్‌టీపీ పార్టీ పేర్కొంది.

తెలంగాణ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల(YS Sharmila) శనివారం ఇందిరా పార్క్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద రైతు వేదన(raithu vedana) దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్‌పై విమర్శల వర్షం కురించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి కొనుగోలుపై ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ రైతన్న నోట్లో మాత్రం సున్నం పెడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వైఖరి వల్ల రైతులు పండించిన వరిని ఎక్కడ పడితే అక్కడ ఆరేసుకుంటూ తిప్పలు పడుతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణపై కేంద్రం పెత్తనం ఏందీ అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR).. ఇప్పుడు కేంద్రం మీద నిందలు ఎందుకు మోపుతున్నారని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు.

click me!