Bandi sanjay: బండి సంజయ్‌ నల్గొండ పర్యటనలో ఉద్రిక్తత.. గో బ్యాక్ అంటూ టీఆర్‌ఎస్ శ్రేణుల నినాదాలు..

Published : Nov 15, 2021, 03:09 PM ISTUpdated : Nov 15, 2021, 03:12 PM IST
Bandi sanjay: బండి సంజయ్‌ నల్గొండ పర్యటనలో ఉద్రిక్తత.. గో బ్యాక్ అంటూ టీఆర్‌ఎస్ శ్రేణుల నినాదాలు..

సారాంశం

బీజేపీ (bjp) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  (Bandi sanjay) నల్గొండలో (nalgonda) ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిందచేందుకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్జాలబావి ఐకేపీ కేంద్రాన్ని బండి సంజయ్ పర్యటిస్తున్న సమయంలో.. ఆయన పర్యటనను అడ్డుకోవడానికి టీఆర్‌ఎస్ నాయకులు ప్రయత్నించారు.

తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు (paddy procurement) సంబంధించి బీజేపీ, టీఆర్‌ఎస్‌ల మధ్య రాజకీయ వేడి కొనసాగుతుంది. ఇప్పటికే ఇరు పార్టీలు పోటాపోటీగా ధర్నాలు చేసిన సంగతి తెలిసిందే.  ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇరు పార్టీ అగ్ర నేతలు సైతం పరస్పర ఆరోపణలకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం బీజేపీ (bjp) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  (Bandi sanjay) నల్గొండలో (nalgonda) ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిందచేందుకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్జాలబావి ఐకేపీ కేంద్రాన్ని బండి సంజయ్ పర్యటిస్తున్న సమయంలో.. ఆయన పర్యటనను అడ్డుకోవడానికి టీఆర్‌ఎస్ నాయకులు ప్రయత్నించారు. సంజయ్ పర్యటనను వ్యతిరేకిస్తూ నల్లజెండాలు ప్రదర్శించారు. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో టీఆర్‌ఎస్ శ్రేణులపైకి దూసుకెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులు టీఆర్‌ఎస్ శ్రేణులను చెదరగొట్టారు.

పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యహరిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ, టీఆర్‌ఎస్ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఒకరిపై ఒకరు కోడిగుడ్లు, చెప్పులు విసిరారు. దీంతో పోలీసులు... పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. ఉద్రిక్తతల నడుమనే ధాన్యం రాశులను పరిశీలించారు. దీంతో శెట్టిపాలెంలో భారీగా పోలీసులను మోహరించారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కేసీఆర్ నియంత్రణ పాలన కొనసాగదని హెచ్చరించారు. 

సీఎం కేసీఆర్ సమస్య పరిష్కరించకుండా తప్పుదోవ పట్టిస్తున్నారని  Bandi sanjay అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. దృష్టి మరల్చేందుకు భయానక వాతావరణం సృష్టించాలని చూస్తే బీజేపీ భయపడే ప్రసక్తే లేదన్నారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలే రైతుల్లాగా వచ్చి గొడవలు చేస్తున్నారని ఆరోపించారు. వానాకాలంలో మొత్తం పంటను ప్రభుత్వం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. పంటలన్నీ కేంద్రం కొనుగోలు చేస్తే సీఎం ఏం చేస్తారని ప్రశ్నించారు. రైతుల కోసం రాళ్ల దాడికి సిద్దమేనని ప్రకటించారు. 60 లక్షల టన్నులు కొనాలని ఎఫ్‌సీఐతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని అన్నారు. 7 లక్షల టన్నులే కొన్నట్టు రాష్ట్ర ప్రభుత్వమే చెబుతుంది.. మరి మిగతా పంట ఎప్పుడు కొంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు