పుల్లెంలలో వైఎస్ షర్మిల దీక్ష: ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్

By narsimha lodeFirst Published Jul 27, 2021, 3:09 PM IST
Highlights

నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్ తో వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం నాడు దీక్ష చేశారు. నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామంలో ఆమె దీక్ష నిర్వహించారు.

చండూరు: నిరుద్యోగ దీక్షలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంలలో వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల  మంగళవారం నాడు నిరహరదీక్షచేపట్టారు.పుల్లెంల గ్రామంలో ఆత్మహత్య చేసుకొన్న నిరుద్యోగి  శ్రీకాంత్ కుటుంబాన్ని షర్మిల తొలుత పరామర్శించారు. శ్రీకాంత్ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని షర్మిల ఆందోళన చేస్తానని ప్రకటించింది. ప్రతి మంగళవారం నాడు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్ తో  నిరహారదీక్ష చేస్తోంది షర్మిల. ఇందులో భాగంగానే పుల్లెంల గ్రామంలో ఇవాళ ఆమె దీక్ష చేశారు. స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి దీక్ష చేపట్టారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆమె ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో తాను రాష్ట్రంలో పాదయాత్ర చేస్తానని ఆమె ప్రకటించారు చేవేళ్ల నుండి పాదయాత్ర చేస్తానని గతంలో ఆమె ప్రకటించారు.త్వరలోనే ఆమె పాదయాత్రను ప్రారంభించనున్నారు.


 

click me!