తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈరోజు వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. ఆడబిడ్డ అయి ఉండి తెలంగాణ తలదించుకునేట్టుగా లిక్కర్ స్కామ్‌లో ఇన్వాల్వ్ అయిందని ఆరోపించారు. బతుకమ్మ ముసుగులో కవిత లిక్కర్ స్కామ్ చేసిందని విమర్శించారు. కవిత డబ్బులు సంపాదిస్తున్నారు కానీ.. మంచి పేరు వస్తుందా? అని ఆలోచించుకోవాలని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వాసన వచ్చేసరికి.. మహిళ మీద ప్రేమ ఉన్నట్టుగా 33 శాతం రిజర్వేషన్ కోసం కొట్లాడతామని అంటున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో మహిళలపై దాడులు, అన్యాయాలు జరుగుతుంటే ఒక్కరినైనా కవిత పరామర్శించిందా? అని ప్రశ్నించారు. మహిళలకు జరుగుతున్న అన్యాయంపై కవిత ఎప్పుడూ కొట్లాడలేదని అన్నారు. ఇప్పుడు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కోసం కోట్లాడతామని అంటున్నారని.. అసలు కేసీఆర్ పాలనలో, బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు రిజర్వేషన్ ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. మొదటి సారి 119 మందిలో ఆరుగురు మహిళలకే టికెట్స్ ఇచ్చారని అన్నారు. అప్పుడు మంత్రివర్గంలో మహిళలకు అసలు చోటే కల్పిలించలేదని విమర్శించారు. వైఎస్సార్ ఒక మహిళను హోం మంత్రిని చేస్తే.. కనీసం బీఆర్ఎస్ వాళ్లు ఒక మహిళకు మంత్రిపదవికి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
Also Read: రేపు విచారణకు హాజరు కాలేను: ఈడీకి కవిత లేఖ
రెండోసారి నలుగురు మహిళలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారని.. ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు ఇచ్చారని అన్నారు. వాళ్లూ కూడా డమ్మీలేనని విమర్శించారు. అలాంటి బీఆర్ఎస్ పార్టీ మహిళల మీద ప్రేమ ఉన్నట్టుగా 33 శాతం రిజర్వేషన్ల కోసం కోట్లాతమని అంటున్నారని మండిపడ్డారు.