వైఎస్ఆర్టీపీ విలీనం.. వైఎస్ షర్మిల ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే ?

Published : Sep 02, 2023, 02:01 PM IST
వైఎస్ఆర్టీపీ విలీనం.. వైఎస్ షర్మిల ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే ?

సారాంశం

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా వైఎస్సాఆర్ జిల్లాలోని ఇడుపులపాయకు వైఎస్సాఆర్టీపీ చీఫ్ షర్మిల శనివారం వచ్చారు. ఈ సందర్భంగా తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించారు. తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు.

గత కొంత కాలం నుంచి వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల శనివారం స్పందించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా ఆమె వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయకు వచ్చారు. ముందుగా తండ్రి సమాధి వద్దకు వెళ్లి నివాళి అర్పించారు. తరువాత అక్కడ ఉన్న మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో వైఎస్సార్టీపీ విలీనంపై మీడియా ఆమెను ప్రశ్నించింది. దీనికి ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటోంది.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలే దానికి సంకేతం - నితీశ్ కుమార్

తన పార్టీ విలీనం గురించి వస్తున్న వార్తలపై మాట్లాడేందుకు ఇది సరైన సమయం, వేధిక కాదు అని షర్మిల అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయి 14 ఏళ్లు అవుతోందని అని ఆమె తెలిపారు. అయినా ప్రజల గుండెల్లో ఇంకా బతికే ఉన్నారని చెప్పారు. తన తండ్రి అద్భుతమైన పథాలను ప్రవేశపెట్టారని, వాటి ద్వారా ప్రజల గుండెల్లో ఆయన శాశ్వతంగా ఉన్నారని పేర్కొన్నారు. వైఎస్సాఆర్ రైతు పక్షపాతి అని షర్మిల కొనియాడారు.

సోషల్ మీడియాలో టీచర్ తో స్నేహం.. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందని కత్తితో దాడి.. కూకట్ పల్లిలో ఘటన

తన తండ్రి రైతుల కోసం విద్యుత్ బకాయిలను మాఫీ చేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఉచిత విద్యుత్ పైనే ఆయన మొదటి సంతకం చేశారని అన్నారు. మహిళ కు పావలా వడ్డి అందించారని షర్మిల తెలిపారు. దీని వల్ల ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నిండాయని చెప్పారు. పేద విద్యార్థులకు చదువులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ఫీజు రీఏంబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని కొనియాడారు.

ఆరోగ్య శ్రీ పథకం, 108 అంబులెన్స్ ల ద్వారా ఎంతో మంది ప్రాణాలను నిలిపారని షర్మిల అన్నారు. కులకు, మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పథకాలు అందించారని ఆమె కొనియాడారు. తన తండ్రి మరణించిన సమయంలో, ఆ బాధను తట్టుకోలేక ఏడువందల మంది గుండెలు ఆగిపోయాయని ఆమె తెలిపారు. వారి కుటుంబాలకు కూడా తాను సంతాపం తెలియజేస్తున్నానని షర్మిల అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్