స్పా సెంటర్ల పేరుతో క్రాస్ మసాజ్ నిర్వహిస్తూ.. వ్యభిచారం చేయిస్తున్న సెలూన్లపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో వ్యభిచారం ముఠాల గుట్టురట్టు చేయడానికి సిఎస్ పోలీస్ యాంటీ ట్రాఫికింగ్ సెల్ స్పెషల్ మెరుపు దాడులు చేస్తోంది. వ్యభిచారానికి అడ్డాలుగా మారుతున్న స్పాలు, మసాజ్ సెంటర్ ల మీద దాడులు చేస్తోంది. దీంట్లో భాగంగానే హైదరాబాదులోని బంజారాహిల్స్, ఫిలింనగర్ లలో యాంటీ ట్రాఫికింగ్ సెల్ సిసిఎస్ టీమ్ తో కలిసి..స్పెషల్ ఆపరేషన్లు చేపట్టింది.
శనివారం బంజారాహిల్స్, ఫిలింనగర్ లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. యాంటీ ట్రాఫికింగ్ సెల్ మసాజ్ సెంటర్ లపై దాడులు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా స్పాసెంటర్లో ముసుగులో.. క్రాస్ మసాజ్ లకు పాల్పడుతూ.. వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా ఈ దాడుల్లో తేలింది.
అమెరికాలో హైదరాబాద్ కు చెందిన వివాహిత ఆత్మహత్య.. ఎందుకంటే ?
ఈ సెంటర్లలో సీసీ కెమెరాలు పెట్టలేదు. అంతేకాదు కస్టమర్ల వివరాలను రిజిస్టర్ లో రాయడం లేదు. ఇలాంటి ఉల్లంఘనలను పాల్పడినందుకు నిర్వాహకుల మీద కేసు నమోదు చేశారు. మేఘవి వెల్నెస్ స్పా, రువాన్ థాయ్ స్పా, సెన్సెస్ ట్రాంక్విల్ ది హెల్త్ స్పా, కానస్ లగ్జరీ స్పా, బోధి వెల్నెస్ స్పా సెంటర్ లపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా, ఆగస్ట్ 29న కూడా ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ లోని రెండు సెంటర్ల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. స్పా సెంటర్లలో యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్సై కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు.
ఇతర ప్రాంతాలనుంచి కొంతమంది యువతులను తీసుకొచ్చి మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఈ స్పా సెంటర్లలో వ్యభిచారం చేయిస్తున్నట్లు తేలింది. నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిమీద కేసులు నమోదు చేశారు. 14మంది యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. వీరితో పాటు ఐదుగురు విటులను అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్ కు తరలించారు.
వేరే ప్రాంతాలనుంచి తీసుకువచ్చిన యువతులకు ఒక్కో యువతికి వారానికి రూ.15 వేలు ఇస్తున్నారు. ఇలా డబ్బులు ఇస్తూ వారితో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు అంగీకరించారు.