వైఎస్ఆర్ అభిమానులతో కమిటీలు: వైఎస్ షర్మిల కీలక నిర్ణయం

Published : Mar 11, 2021, 03:56 PM IST
వైఎస్ఆర్ అభిమానులతో కమిటీలు: వైఎస్ షర్మిల కీలక నిర్ణయం

సారాంశం

 తెలంగాణలో  పార్టీ ఏర్పాటు విషయమై వైఎస్ షర్మిల అన్ని ఏర్పాట్లు చేసుకొంటున్నారు. పార్టీ ఏర్పాటుకు ముందుగా వైఎస్ అభిమానులతో కమిటీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

హైదరాబాద్: తెలంగాణలో  పార్టీ ఏర్పాటు విషయమై వైఎస్ షర్మిల అన్ని ఏర్పాట్లు చేసుకొంటున్నారు. పార్టీ ఏర్పాటుకు ముందుగా వైఎస్ అభిమానులతో కమిటీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వైఎస్ఆర్ అభిమానులతో ఆమె సమావేశాలు నిర్వహిస్తున్నారు.ఈ సమావేశాలను పూర్తి చేయనుంది. ఆయా జిల్లాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను ఆమె తెలుసుకోనున్నారు. 

వైఎస్ఆర్ అభిమానులతో సమావేశాలు ముగిసిన తర్వాత పార్టీ ఏర్పాటు గురించి షర్మిల ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

రాష్ట్రంలో వైఎస్ఆర్ అభిమానులను గుర్తించి వారితో కమిటీలను ఏర్పాటు చేయాలని షర్మిల నిర్ణయం తీసుకొన్నారు. ఈ నెల 16 లోపుగా కమిటీలను ఏర్పాటు చేయాలని షర్మిల తన ముఖ్య అనుచరుడు పిట్టా రాంరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. 

వైఎస్ఆర్ తో సన్నిహితంగా ఉన్న నేతలు ఎవరు, వైఎస్  తో కలిసి నడిచినవారెవరూ  తదితర వివరాలను ఆధారంగా చేసుకొని ఈ కమిటీ వివరాలను సేకరించి షర్మిలకు అందించనుంది.

పార్టీకి వైఎస్ఆర్ అభిమానుల సేవలను ఉపయోగించుకొనేందుకు గాను ఈ జాబితాను తయారు చేస్తున్నారని సమాచారం.

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?