కొత్తగా చైర్మెన్ కదా... తెలియక చేశాడు: దేత్తడి హరిక ఇష్యూపై మంత్రి శ్రీనివాస్ గౌడ్

Published : Mar 11, 2021, 03:08 PM IST
కొత్తగా చైర్మెన్ కదా... తెలియక చేశాడు: దేత్తడి హరిక ఇష్యూపై మంత్రి శ్రీనివాస్ గౌడ్

సారాంశం

తెలంగాణ టూరిజం శాఖకు బిగ్ బాస్ ఫేం హరికను బ్రాండ్ అంబాసిడర్ గా  అపాయింట్ మెంట్ ఎలా ఇచ్చారో తనకు తెలియదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.గురువారం నాడు మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్  మహబూబ్ నగర్ లో మీడియాతో మాట్లాడారు.  

హైదరాబాద్: తెలంగాణ టూరిజం శాఖకు బిగ్ బాస్ ఫేం హరికను బ్రాండ్ అంబాసిడర్ గా  అపాయింట్ మెంట్ ఎలా ఇచ్చారో తనకు తెలియదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.గురువారం నాడు మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్  మహబూబ్ నగర్ లో మీడియాతో మాట్లాడారు.

దేత్తడి హరిక నియామకంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. కొత్తగా చైర్మెన్ కదా తెలియక చేశాడని టూరిజం కార్పోరేషన్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గురించి ఆయన వ్యాఖ్యానించారు.

ఏం జరిగిందో, అపాయింట్ మెంట్ ఎలా ఇచ్చారో తెలియదన్నారు. కూర్చొని మాట్లాడుకొని ఇబ్బంది లేకుండా చూసుకొంటామని మంత్రి స్పష్టం చేశారు.
శ్రీనివాస్ గుప్తాతో ఎలాంటి విభేదాలు లేవన్నారు. కమిటీ వేసి అందరూ ఓకే అనుకొంటే హరికను కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు.సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి పరిష్కరించుకొంటామని ఆయన వివరించారు. 

ఇదిలా ఉంటే ఈ నియామకంపై చోటు చేసుకొన్న వివాదం నేపథ్యంలో బ్రాండ్ అంబాసిడర్ నుండి తప్పుకొంటున్నట్టుగా హరిక ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
 

PREV
click me!

Recommended Stories

School Holidays : ఇంకో మూడ్రోజులే ఫుల్ వర్కింగ్ డేస్... తర్వాత వరుస సెలవులే, బ్యాక్ టు బ్యాక్ లాంగ్ వీకెండ్స్
Hyderabad Real Estate : హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్... ఇక్కడ ఒక్క ఎకరం రూ.250 కోట్లా..!