వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికుంటే వరంగల్ అభివృద్దిలో దూసుకుపోయేదని వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. బుధవారం నాడు హైద్రాబాద్‌లోలోని లోటస్ పాండ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులతో ఆమె సమావేశమయ్యారు. ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆమె నివాళులర్పించారు.
హైదరాబాద్: వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికుంటే వరంగల్ అభివృద్దిలో దూసుకుపోయేదని వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. బుధవారం నాడు హైద్రాబాద్‌లోలోని లోటస్ పాండ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులతో ఆమె సమావేశమయ్యారు. ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆమె నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కాళోజీ పుట్టిన గడ్డ వరంగల్ అని ఆమె చెప్పారు. ఉద్యమకారులను, కళాకారులను అందించిన జిల్లాగా ఆమె పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఎలుగెత్తి చాటిన జిల్లా వరంగల్ అని ఆమె గుర్తు చేశారు. అంతేకాదు తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలు ఎత్తించి జాతీయ గీతం రాసిన అందెశ్రీ ది కూడ వరంగల్ జిల్లానే ఆమె చెప్పారు.
అనేక మంది ఉద్యమకారులు, కళాకారులను అందించిన జిల్లా వరంగల్ అన్నారు. వరంగల్ తో వైఎస్ఆర్ కు ఎంతో అనుబంధం ఉందన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టును 80 శాతం పూర్తి చేసిన ఘనత వైఎస్ఆర్ దేనని ఆమె గుర్తు చేశారు.
మీ సూచనలు, సలహాలు, రాజన్న బిడ్డకి అవసరమన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ఎందుకు నిర్లక్ష్యం చేశారని ఆమె ప్రశ్నించారు. కాకతీయ యూనివర్శిటీకి వీసీ కూడా లేడన్నారు. విద్యార్ధులు ప్రశ్నిస్తే చాలా దాడులు జరిపారని ఆమె విమర్శించారు.