విశాఖ ఉక్కు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు: కేటీఆర్

By narsimha lodeFirst Published Mar 10, 2021, 1:51 PM IST
Highlights

విశాఖ ఉక్కు ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు. అవసరమైతే విశాఖపట్టణానికి వెళ్లి ఈ ఉద్యమంలో పాల్గొంటానని ఆయన ప్రకటించారు.


హైదరాబాద్: విశాఖ ఉక్కు ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు. అవసరమైతే విశాఖపట్టణానికి వెళ్లి ఈ ఉద్యమంలో పాల్గొంటానని ఆయన ప్రకటించారు.

గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణికి మద్దతుగా ప్రైవేట్ విద్యా సంస్థల ప్రతినిధులతో హైద్రాబాద్ లో బుధవారం నాడు నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

వాణి ప్రశ్నించే గొంతు కాదు... పరిష్కరించే గొంతు అని ఆయన చెప్పారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక  అనేక సమస్యలను పరిష్కరించామన్నారు. 65 ఏళ్లలో పరిష్కారం కానీ సమస్యలను ఆరేళ్లలో పరిష్కారించినట్టుగా ఆయన గుర్తు చేశారు. 

విద్యారంగ సమస్యలన్నీ పరిష్కరించామన్నారు. ఆరేళ్లలో 1.32 లక్షల ఉద్యోగాలను కల్పించామన్నారు. ఈ విషయమై తన మాటలు అసత్యమని నిరూపిస్తే తాను దేనికైనా సిద్దమని  కేటీఆర్ సవాల్ విసిరారు.కాంగ్రెస్ హయంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

గ్యాస్, డీజీల్ ధరల పెంపుపై బీజేపీ నేతలు ఏం చెబుతారని ఆయన ప్రశ్నించారు.దేశం కోసం, ధర్మం కోసమని బీజేపీ నేతల మాటలను ఆయన ప్రస్తావిస్తూ ఏ దేశం కోసం ధరలు పెంచాలరని ఆయన ప్రశ్నించారు. 

ప్రజల కోసం ఏం చేయని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని ఆయన అడిగారు. రామచందర్ రావు గొంతులో ప్రశ్నలు ఏమయ్యాయన్నారు. తెలంగాణ డిమాండ్లపై బీజేపీ నేతలు ఎందుకు నోరు తెరవడం లేదో చెప్పాలన్నారు.

click me!