ఖమ్మం బయలుదేరిన షర్మిల: అందరి చూపు పెవిలియన్ గ్రౌండ్స్ వైపే (వీడియో)

By narsimha lodeFirst Published Apr 9, 2021, 12:13 PM IST
Highlights

ఇవాళ సాయంత్రం ఖమ్మంలో జరిగే సభలో పాల్గొనేందుకు వైఎస్ షర్మిల హైద్రాబాద్ నుండి బయలుదేరి వెళ్లారు.ఈ సభను షర్మిల అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారు.  ఈ సభలో షర్మిల ఏం చెబుతారనే విషయమై  రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా చూస్తున్నారు.


హైదరాబాద్: ఇవాళ సాయంత్రం ఖమ్మంలో జరిగే సభలో పాల్గొనేందుకు వైఎస్ షర్మిల హైద్రాబాద్ నుండి బయలుదేరి వెళ్లారు.ఈ సభను షర్మిల అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారు.  ఈ సభలో షర్మిల ఏం చెబుతారనే విషయమై  రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా చూస్తున్నారు.

ఖమ్మం పట్టణంలోని పెవిలియన్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న ఈ సభకు సంకల్ప సభ అని నామకరణం చేశారు. తెలంగాణ రాజన్న రాజ్యం తెచ్చేందుకు తాను ప్రయత్నిస్తానని షర్మిల చెప్పారు.  ఈ సభలో పార్టీ విధి విధానాలను ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.ఈ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.  ఈ సభలో వైఎస్ విజయమ్మ కూడ పాల్గొంటారు. ఖమ్మం పట్టణ సమీపంలోనే షర్మిల, విజయమ్మలకు ఘనంగా స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు. 

ఇవాళ ఉదయం 8 గంటలకు  భారీ కాన్వయ్ తో షర్మిల లోటస్ పాండ్ నుండి ఖమ్మం బయలుదేరారు. లక్టీకాపూల్, కోఠి, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్ , హయత్ నగర్ కు ఉదయం 9:30 గంటలకు చేరుకొన్నారు. హయత్ నగర్ లో షర్మిలకు వైఎస్ఆర్ అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.

ఉదయం పదిన్నర గంటలకు  చౌటుప్పల్, మధ్యాహ్నం 12 గంటలకు నకిరేకల్, 12 గంటల 45 నిమిషాలకు సూర్యాపేటలో ఆమెకు ఘనంగా స్వాగతం పలకనున్నారు.  చివ్వెంలో ఆమె మధ్యాహ్న భోజనం కోసం ఆగుతారు.మోతె మండలం నామవరంలో రెండున్నర గంటలకు చేరుకొంటారు. మూడు గంటలకు ఖమ్మం జిల్లా నాయకన్ గూడెం చేరుకొంటారు. సాయంత్రం 5:15 గంటలకు పెవిలియన్ గ్రౌండ్స్ కు షర్మిల చేరుకొంటారు.
"

click me!