ఓటర్లతో ప్రమాణం: మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై కేసు

By narsimha lodeFirst Published Apr 9, 2021, 10:53 AM IST
Highlights

మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ తరపున  శంకర్ నాయక్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

నాగార్జునసాగర్:మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ తరపున  శంకర్ నాయక్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ ప్రచారంలో భాగంగా  త్రిపురారం మండలం ఇంచార్జీగా ఉన్న  శంకర్ నాయక్  సత్యంపాడు తండాలో టీఆర్ఎస్ కే ఓటు వేసేలా ప్రమాణం చేయించారని ప్రత్యర్ధులు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదే విషయమై గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు త్రిపురారం పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు.సామాజిక వర్గాల వారీగా అధికార పార్టీ  ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిందని  ఓటర్లతో ప్రమాణం చేయడం కూడ ఇందులో భాగమేనని కాంగ్రెస్ నేత ఆరోపించారు.ఈ నెల 17వ తేదీన  నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఉప ఎన్నికల్లో  విజయం కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు తమ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి.

కాంగ్రెస్ సీనియర్ నేత జానాారెడ్డి ఈ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అందరి కంటే ముందే కాంగ్రెస్ పార్టీ ఈ స్థానానికి అభ్యర్ధిని ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషణ్ విడుదలైన  తర్వాత టీఆర్ఎస్, బీజేపీలు తమ అభ్యర్ధులను ప్రకటించాయి.

 

click me!