వైఎస్ఆర్ 12వ వర్ధంతి:వైఎస్ షర్మిల భావోద్వేగ ట్వీట్

Published : Sep 02, 2021, 01:24 PM IST
వైఎస్ఆర్ 12వ వర్ధంతి:వైఎస్ షర్మిల భావోద్వేగ ట్వీట్

సారాంశం

వైఎస్ఆర్ 12వ వర్ధంతిని పురస్కరించుకొని  వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా వైఎస్ఆర్ తో  తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకొన్నారు. భావోద్వేగంతో కూడిన ట్వీట్ ను ఆమె పంచుకొన్నారు. ఇవాళ ఉదయమే ఇడుపులపాయలో వైఎస్ఆర్ సమాధి వద్ద ఇమె నివాళులర్పించారు.


హైదరాబాద్: తన తండ్రి 12వ వర్ధంతి సందర్భంగా ట్విట్టర్ వేదికగా వైఎస్ షర్మిల చేసిన భావోద్వేగ ట్వీట్ చేశారు. వైఎస్ఆర్ వర్థంతిని పురస్కరించుకొని  ఇవాళ ఇడుపులపాయలో ఆమె తండ్రి సమాధి వద్ద నివాళులర్పించారు.  ఆ తర్వాత ఆమె ట్విట్టర్ వేదికగా  తన తండ్రితో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకొన్నారు.

 

ఒంటరిదాన్నైనా విజయం సాధించాలని అవమానాలు ఎదురైనా ఎదురీదాలన్నారు. కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. ఎప్పుడూ ప్రేమనే పంచాలని తన వెన్నంటి నిలిచి  తనను  ప్రోత్సహించారని ఆమె వైఎస్ఆర్ ను గుర్తు చేసుకొన్నారు. తనను కంటి పాపలా చూసుకొన్నారని, తనకు బాదొస్తే మీ కంట్లోంచి నీరు కారేదన్నారు. ఇవాళ తన కన్నీరు ఆగనంటుందని షర్మిల బావోద్వేగానికి గురయ్యారు. ఇవాళ ఇడుపులపాయలో ఏపీ సీఎం వైఎస్ జగన్ తో పాటు షర్మిల, వైఎస్ విజయమ్మ, ఏపీకి చెందిన పలువురు మంత్రులు, వైసీపీ ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. 


 

PREV
click me!

Recommended Stories

Harish Rao Comments on Revanth Reddy:టెండర్లురద్దు చేసి సిబిఐవిచారణ జరిపించాలి | Asianet News Telugu
Airport: హైద‌రాబాద్ ఒక్క‌టే కాదు.. ఈ ప్రాంతాల్లో కూడా రియ‌ల్ బూమ్ ఖాయం. కొత్త ఎయిర్ పోర్టులు